ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు

Allu Arjun, Maheshbabu
Allu Arjun, Maheshbabu

మహేష్ బాబు స్పైడర్ చిత్రం తరువాత ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు తొలిసారిగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు. రాజకీయ నాయకుడుగానూ, ఎన్నారైగానూ రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న విడుదల చేస్తామని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ రోజు జరిగిన ఒక ప్రెస్ మీట్ లో నిర్మాత బన్ని వాసు అల్లు అర్జున్ నటిస్తున్న ‘నాపేరు సూర్య’ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చెయ్యబోతునట్లు ప్రకటించాడు. ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు వేసవిలో విడుదల కావడం విశేషం. వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలతో ఈ వేసవి మరింత వేడేక్కబోతుంది.