ఒకే గది చిరునామాతో 114 కంపెనీలు

SHELL
SHELL

రాజధానిలో డొల్ల కంపెనీల కథాకమామీషు
ఏకకాలం దాడులతో బైటపడిన కంపెనీలు
హైదరాబాద్‌: డొల్లకంపెనీలసాయంతో మనీలాండరింగ్‌,పన్నుల ఎగవేత ఎక్కువగా సాగుతున్నదన్న అభియోగాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 2.50 లక్షలకంపెనీలపై ఉక్కుపాదం మోపింది. అదేవిధంగా హైదరాబాద్‌లో కూడా ఈ డొల్లకంపెనీలు ఎక్కువసంఖ్యలో ఉండటంతో వాటిపై కూడా దాడులు ముమ్మరం అయ్యాయి.కంపెనీల రిజిస్ట్రారు కార్యాలయం అధికారులు వీటిపై ఏకకాలంలో దాడులుచేసారు. సుమారు 25 కంపెనీలు ఒకే గదినుంచి నిర్వహిస్తున్నట్లుగా రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఎనిమిది మంది అధికారులు ఫార్చ్యూన్‌మోనార్క్‌ మాల్‌ అనే కాంప్లెక్స్‌ను సందర్శించారు. జైజూబ్లిహిల్స్‌ ప్రాంతంలో ఉన్న ఈ మాల్‌లో చూస్తే 114 కంపెనీలు ఒకే గదినుంచి చిరునామాతో కొనసాగుతున్నట్లు తేలింది. ఆగదినే తమ కంపెనీగాచూసిప్తూ ఆస్తి అప్పుల పట్టీలు, డైరెక్టర్లపేర్లు, చిరునామాలు, వారి వేతనాలనుసైతం పొందుపరిచారు. ఎక్కువశాతం డొల్లకంపెనీలు ఒకరికిఒకరు సెక్యూరిటీగా చూపిస్తూ రుణాలు పొందుతున్నట్లు తేలింది. అంతేకాకుండా వీటిని కేవలం నగదును చెలామణిలోనికి తెచ్చేందుకు వినియోగిస్తునానరు. 114 కంపెనీల్లో కనీసం 50 కంపెనీలు అసలు వ్యాపార కార్యకలాపాలేనిర్వహించడంలేదు. ఎక్కువశాతం కంపెనీలు నష్టాలను చూపిస్తున్నాయి. ఈ నష్టాలు కూడా రూ.ఎనిమిది కోట్లనుంచి 15కోట్లవరకూ ఉన్నట్లు చెపుతున్నాయి. కంపెనీలు స్థిరాస్తులుగా వ్యవసాయభూమిని చూపిసుత్నఆ్నయి. అంతేకాకుండా డైరెక్టర్లపేరుతో రిటర్నులు దాఖలుచేస్తున్నాయి. ఈ డైరెక్టర్లే సుమారు 25 నుంచి 30 కంపెనీలను నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడి అయింది. అంతేకాకుండా వీరంతా మంచి జీతాలు పొందుతున్నట్లు సైతం అధికారులుగుర్తించారు. కంపెనీలచట్టంప్రకారం ఒకే వ్యక్తి 20కంపెనీలకుమించి డైరెక్టర్‌గా వ్యవహరించేందుకునిబంధనలు అంగీకరించవు. ఈ కంపెనీల దస్త్రాలను సమగ్రంగాపరిశీలించిన తర్వాతనే వీటిపై ప్రాసిక్యూషన్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. మరో ఆరు ప్రాంతాల్లో ఈ డొల్లకంపెనీలున్నట్లు అందిన సమాచారంతో కంపెనీల రిజిస్ట్రారు అధికారులు ఈప్రాంతాల్లో కూడా ఏకకాలంలో దాడులుచేయాలని నిర్ణయించారు. ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్‌ అడ్వయిజరీ సర్వీస్‌ అనే కంపెనీ అకౌంటెంట్‌ ఈ డొల్లకంపెనీలన్నింటికీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు హిల్‌కౌంటీఅంటే గతంలో మైటాస్‌ వంటివి కంపెనీలు కూడా వీటిఓ ఉన్నాయి. మేటాస్‌ను గతంలో సత్యం వ్యవస్థాపకులు బి.రామలింగరాజు కుమారుడు స్థాపించారు. మరో ఆరు ప్రాంతాల్లోసైతం ఇలా ఒకేగదిని కేంద్రంగా చేసుకుని కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఈ ఆరుచోట్లలో ఒకే ఇంటిపేరిట 48కంపెనీలు ఒకచోట, మరోచోట 38 ఇంకొక ప్రాంతంలో 33, ఇతత్రా 28 కంపెనీలు ఉన్నట్లు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ రాష్ట్ర అధికారులకు సమాచారం ఇచ్చింది.