ఒకేసారి తినకండి

eating ee
Eating

ఒకేసారి తినకండి

టీ, కాఫీ, వేపుడు పదార్థాలు, మసాలా పదార్థాలు, స్వీట్లు, చాలా చల్లని లేదా చాలా వేడిపదా ర్థాలు తిన్నపుడు ఇవి మెదడును డిప్రెషన్‌ ప్రభావానికి గురిచేసి మెదడు సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి. ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం, సమయం సందర్భం లేకుండా ఆహారాన్ని తీసుకోవడం కూడా మానసిక, శారీరక ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయట.

మంచి ఆరోగ్యం మీ సొంతం కావాలంటే ఎక్కువ మోతాదులో ఒకేసారి ఆహారాన్ని తీసుకోకుండా, ఎక్కువసార్లు తక్కువ మోతాదుల్లో, కచ్చితమైన వేళలు పాటిస్తూ ఆహారాన్ని తీసుకోవాలి. పొట్టనిండుగా ఆహారం తీసుకోకుండా కాస్త ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. అపుడపుడూ ఉపవాసాలు ఉండడం మీ మెదడు చురుకుగా పనిచేయడానికి, శరీరం లోపలి వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది.

వీటితో పాటు ఎక్కువ మోతాదులో నీళ్లు తాగండి. తాజా కూరగాయలు, పళ్లు తీసు కోవడం మీ లోపలి వ్యవస్థలను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. తినేటపుడు కూడా మనసు ప్రశాంతంగా ఉండాలి.