ఒకరికి ఒకరు కలిసుంటే…

COUPLE-1
COUPLE

ఒకరికి ఒకరు కలిసుంటే…

ఆలుమగలు ఇద్దరూ ఒకేసారి కోపంతో ఉండకూడదు. తన కోపమే తన శత్రువ్ఞ. తన శాంతమే తనకు రక్ష అన్నారు. ఒకరు కోపంగా ఉన్నప్పుడు మరొకరు మౌనం వహిస్తే పరిస్థితి అదుపులో ఉంటుంది. ఇద్దరూ ఒకేసారి కోపంతో అరుచుకుంటే ఇరుగుపొరుగుకి అలుసవ్ఞతారు. హాట్‌టాపిక్‌ అవ్ఞతారు. కోపం తెచ్చుకోవద్దని చెప్పడం సులువే. ఇది వినడానికి ఎంతో బాగుం టుంది. కానీ ఆచరణే కష్టం. ఎందుకంటే చికాకులకు ఏ స్వీట్‌హోమ్‌ అతీతం కాదు. కోపం అంటువ్యాధి వంటిది. మనిషి నుంచి మనిషికి సోకుతుంది. దుష్ప్రభావం కల్గిస్తుంది.

అది గతం నుంచి వర్తమానానికి కూడా ప్రస్తావించగలదు. బాధను మరచిపోవచ్చు. కాని కాలాన్ని అదుపులో ఉంచడం కష్టమే. కోపానికి జవాబు కోపమే కావచ్చు. కాకపోతే మనస్తాపాలు చోటు చేసుకుం టాయి. ఇది అంతా మామూలే కావచ్చు. మరి కోపాలు ఎలా చల్లార తాయి…? పట్టరాని కోపంతో ఊగిపోతుంటే మరోపక్క ఎవరో అదేపనిగా నవ్ఞ్వతూ పలకరిస్తుంటే ఏం జరుగు తుంది? కోపం చల్లారవచ్చు లేదా తారాస్థాయికి చేరనూవచ్చు. సరదాలు, సరసాలు…: ఒకపక్క ఇంట్లో వాతావరణం ఉద్రేకపూరితంగా ఉంటే మరోపక్క ఆలుమగలు అరుచుకోవడం అగ్నికి ఆజ్యంపోయడమే. ఇద్దర్లో ఎవరో ఒకరు కోపంగా లేకపోతే అరుచుకునే పరిస్థితి ఉండదు. సరసాలు, సరాగాలు నిండిన చోట రుసరుసలు, ఉక్రోషాలు మొదలవ్ఞతాయి. కంఠస్వరాలు తీవ్రమవ్ఞతాయి. అరుపులు పెరుగుతాయి. మాటలు ఈటెల్లా విసురుకుంటారు.

ఎత్తిపొడుపులకు దిగుతారు. స్థిమితాన్ని కోల్పోతారు. ఇదంతా అవసరమా….? ఆలోచించండి. అరచి అనర్థం తెచ్చుకోవడం ఎందుకు? విమర్శించదలిస్తే ఆ పనిని ప్రేమపూర్వకంగా చేయాలి. భార్యా భర్తల మధ్య అలకలు, తగువ్ఞలు, బుజ్జగింపులు ఇవన్నీ సహజం. మాటకు మాట అంటే జరిగేది వాగ్యుద్ధమే. ఏ తగవ్ఞ అయినా భార్యాభర్తల బంధం ముందు చాలా చిన్నదే. చులకనగా మాట్లాడటం, విమర్శలు కన్నా పరస్పర గౌరవం ముఖ్యం. గతంలోని తప్పొ ప్పుల తవ్వకాలు వద్దు. చిన్నచిన్న తగాదాలు వైవాహిక జీవితంలో సహజంగా చోటుచేసు కునేవే. ఇవి శాశ్వతం కావ్ఞ. ఇద్దరి మధ్య అనురాగం, ప్రేమానుబంధాలు శాశ్వతం.

అవి నిత్యనూతనంగా సాగాలంటే ఇద్దరూ వారి వంతుగా ప్రయత్నం చేయాలి. ఒకరినొకరు నిర్లక్ష్యం చేసుకునేకన్నా ప్రపంచ పోకడల్ని గమనించండి. యువ జంటలు ఎలా జీవితాన్ని గడుపుతున్నారో చూడండి. మల్లిపుల్‌ కెరీర్స్‌…వినోద విహారాల కాంక్ష. సాంస్కృతిక అభిరుచులు, భవిష్యత్‌ ప్రణాళికలు, పిల్లల చదువ్ఞలు క్లాస్‌లో వాళ్ల ప్రతిభాకౌశలాలు ఆ దిశలో వాళ్ళను సన్నద్ధం చేయడం, ఎన్నో మల్టిపుల్‌ టాస్క్‌లు, వీటన్నింటినీ నిభాయించుకు వస్తున్న శ్రీమతిని మీరు అలక్ష్యం చేయగలరా? రెక్కలు ముక్కలు చేసుకుంటున్నానని మీరు, మీరే కాదు నేనూ సంపాదిస్తున్నాను. పైగా ఇంటెడు చాకిరీ చేసున్నానని మీ శ్రీమతి ఇద్దరిలో ఏ ఒక్కరనుకున్నా మరొకరి పెదాలపైన మౌనం తప్పదు. కొద్దిపాటి శ్రద్ధ, జాగ్రత్త వహిస్తే మీది కలతలు లేని కాపురమే అవ్ఞతుంది. సంతోషం, ప్రేమ, పేరు ప్రఖ్యాతలు, ఆర్థిక ఉన్నతి సామాజిక ప్రతిపత్తి ఎన్నుకున్న రంగంలో వికాసం ఇవన్నీ సమకూరాలంటే ఎవరికైనా భాగస్వామి తోడ్పాటు అవసరం.

కొంతమంది కెరీర్‌, బెటర్‌ ప్రాస్పెక్ట్‌ కోసం తరుచూ కంపెనీలు మారాలనో, విదేశాలకు వెళ్లాలనో భావిస్తుంటారు. ఈ విషయంలో జీవితభాగస్వామి ఆలోచనకు అవకాశం ఇవ్వాలి. ఈ విషయంలో ఆచితూచి నిదానంగా వ్యవహరించాలని ఆమె, కాదు…ఇప్పుడే పరిష్కారం వెతకాలని మీరు. మీకు నిద్రపట్టదు. ఆమెకు నిద్ర ముంచుకొస్తుంది. మీ కనురెప్పలు బరువ్ఞ ఎక్కుతుంటాయి. వాదం పరిష్కారం కాకుండా నిద్రపోకూడదు. ఏకాభిప్రాయం కుదరని అంశాలు వాయిదావేయాలి. అంతేకాని రాత్రికి రాత్రే పరిష్కారాలు అన్వేషించకూడదు. జీవితానికి, కెరీర్‌కు సంబంధించిన విషయాలను ప్రశాంతంగా చర్చించుకోవాలి. వైవాహిక జీవితం అంటే ఒకేలా ఆలోచించడం కాదు.

ఆలుమగలు ఇద్దరూ కలిసి ఆలోచించడం. ఆమెపై మీకెంత ప్రేముందో మీ చేతలలో, మీ మాటలలో తెలియాలి. కీచులాటలు, వాదులాటలు మీ బంధం ముందు ఎంతో చిన్నవని గ్రహించాలి. పొరపాటునో, గ్రహపాటునో ఏదో జరిగింది. ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. ఆవేశం హద్దులు దాటింది. మాట ఈటె అయింది. అవతలివారి మనస్సు గాయమైంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దపు తెరవాలింది. ్పు మధ్య నిశ్శబ్దపు తెరవాలింది.