ఒంగోలు విశ్వవిద్యాలయానికి ప్రకాశం పేరు

TANGUTURI PRAKASHAM
TANGUTURI PRAKASHAM

ఒంగోలు: ఒంగోలులో రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన దస్త్రానకి ప్రభుత్వం అంగీకరిస్తు గురువారం రాత్రి జీవో నంబరు32 ను విడుదల చేసింది. దీంతో జిల్లాలోని విద్యార్థులు, ఆచార్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఒంగోలు పీజీ కేంద్రాన్ని విశ్వవిద్యాలయంగా ఉన్నతీకరిస్తూ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఒంగోలులో అన్ని వసతులు ఉన్నాయంటూ ఉన్నత విద్యామండలి సభ్యులు అందజేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. 201920 విద్యాసంవత్సరం నుంచే ఒంగోలులో విశ్వవిద్యాలయం అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్ష అభియాన్‌(రూసా) ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నారు.