ఐ-ఫ్యాన్‌ రెగ్యులేటర్‌ సృష్టికర్తలు..!

I Fan
ఇంటర్నెట్ డెస్క్ : కేరళ విద్యార్థులు సరికొత్త ఫ్యాన్ ను ఆవిష్కరించారు. కేరళలోని ప్రభుత్వ మోడల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు ఫ్యాన్‌ వేగాన్ని నియంత్రించేందుకు ఈ ‘ఐ-ఫ్యాన్‌ రెగ్యులేటర్‌’ ను తయారుచేశారు. ఐ(ఇంటెటిజెంట్‌)-ఫ్యాన్‌ పేరుతో పిలిచే ఈ పరికరాన్ని ప్రస్తుతం ఉన్నఫ్యాన్లకే అమర్చుకునే వీలుందని చెబుతున్నారు. ఈ పరికరం 2.5 అంగుళాల తెరను కలిగి ఉంటుంది. ఒకసారి ఫ్యాన్‌ ఆన్‌ చేయగానే.. గది ఉష్ణోగ్రతను తెరపై చూపించడమే కాకుండా.. అందుకు తగ్గట్టుగా ఫ్యాన్‌ స్పీడ్‌ను నియంత్రిస్తుందట. గదిలో ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రత ఉండేలా ఈ ఐ-ఫ్యాన్‌ రెగ్యులేటర్‌ చేస్తుందట. అంతేకాదు.. గదిలో ఉష్ణోగ్రత తగ్గి సాధారణ స్థితికి వచ్చిన వెంటనే ఫ్యాన్‌ దానంతట అదే ఆగిపోతుందని చెబుతున్నారు. రూ.350 విలువ చేసే ఈ పరికరాన్ని వర్షాకాలంలోపే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.