ఐస్‌ టీ

ఐస్‌ టీ

Ice tea
Ice Tea

కావలసినవి

మంచినీరు-8కప్పులు ఆరెంజ్‌ ఫ్లేవర్‌ టీ బ్యాగులు-3 స్వీటెనర్‌-ముప్పావు కప్పు నిమ్మకాయ రసం-అరకప్పు

తయారుచేసే విధానం

ఒక పెద్ద సాస్‌ ప్యాన్‌లో నీళ్లు పోసి వేడిచేయండి. కొంత సమయం తరువాత పొయ్యిపై నుంచి ప్యాన్‌ను తీసేసి టీ బ్యాగులను అందులో వేయండి. పైన మూతపెట్టి దాదాపు ఒక గంట వరకు దాన్ని టచ్‌ చేయకండి. గంట సమయం తరువాత ఈ ప్యాన్‌పై మూతను తీసేసి అందులో కొంచెం స్వీట్‌నర్‌ వేసి టీ బ్యాగ్‌లను తీసేసి బాగా కలపండి. ఇందులో నిమ్మకాయ రసాన్ని వేసి మళ్లీ కలపండి. ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్‌లో పెట్టి చల్లగా ఉన్నప్పుడు సర్వ్‌ చేయండి.