ఐసిస్ మార‌ణ‌హోమంపై రాహుల్ దిగ్బ్రాంతి

Rahul Gandhi
Rahul Gandhi

న్యూఢిల్లీః ఇరాక్‌లో నరహంతక ముఠా ఐఎస్ఐఎస్ చేతిలో 39 మంది భారతీయులు మరణించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ట్విటర్‌ ద్వారా రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘‘2014 నుంచి ఇరాక్‌లో బందీలుగా ఉన్నారని భావిస్తున్న 39 మంది భారతీయులు మరణించారని విని షాక్‌కు గురయ్యాను. తమ ఆప్తులు ఎలాంటి హాని లేకుండా తిరిగి వస్తారంటూ ఇంతకాలం ఎదురుచూసిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. మీరంతా ఈ కష్టకాలం నుంచి త్వరగా బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా…’’ అని పేర్కొన్నారు.