ఐసిసి హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ద్రావిడ్‌కు చోటు

DRAVID
DRAVID

ముంబై: భారత క్రికెట్‌ ఆటగాడు, మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రావిడ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఐసిసిలో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ద్రావిడ్‌ స్థానం దక్కించుకున్నారు. ఐసిసి హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఐదో ఆటగాడిగా ద్రావిడ్‌ నిలిచారు. ఇంతవరకు ఈ గౌరవాన్ని బిషన్‌ సింగ్‌ బేడీ, సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌దేవ్‌, అనిల్‌ కుంబ్లేలు ఈ జాబితాలో చోటు సంపాదించారు. తనకు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కడంపై రాహుల్‌ ద్రావిడ్‌ సంతోషం వ్యక్తం చేశారు.