ఐసిసి తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో జడేజా

jadeja
jadeja

ఐసిసి తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో జడేజా

న్యూఢిల్లీ: ఐసిసి తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు జడేజా బౌలర్ల జాబితాలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.ఆ తరువాత స్థానంలో మరో భారతీయ ఆటగాడు అశ్విన్‌ ఉన్నాడు.బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ మరో స్థానం దిగజారి అయిదవ స్థానానికి పడిపోయాడు.ఆల్‌రౌండర్‌ జాబితాలో బంగ్లాదేశ్‌ ఆటగాడు షకీబ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.తాజాగా భారత్‌-ఆస్ట్రేలియా,న్యూజిలాండ్‌-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్‌లు ముగిశాయి.వరుస టెస్టుల్లో సత్తాచాటిన పలువురు ఆటగాళ్లు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.ఆసీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో సరిగా ఆడలేక కోహ్లీ టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో నాలుగవ స్థానం నుంచి అయిదవ స్థానానికి పడిపోయాడు.499 పరుగులతో దూసుకుపోయిన ఆసీస్‌ సారధి స్టీవ్‌ స్మిత్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

న్యూజిలాండ్‌,ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కేన్‌ విలియమ్సన్‌,జా§్‌ు రూట్‌ తరువాత స్థానాల్లో ఉన్నారు.గత వారం రెండవ స్థానంలో ఉన్న పుజారా తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు దిగజారి నాలుగవ స్థానాన్ని దక్కించుకున్నారు. 11 స్థానాలు ఎగబాకిన కెఎల్‌ రాహుల్‌ 11వ స్థానంలో నిలువగా మూడు స్థానాలు ఎగబాకిన రహానే 14వ స్థానంలో నిలిచాడు.బౌలర్ల జాబితాలో టాప్‌-20 లో ఇద్దరు భారతీయ ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు.జడేజా,అశ్విన్‌ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా,అశ్విన్‌ రెండు,మూడు స్థానాలు దక్కించు కున్నారు.