ఐసియులో చేరిన విజయ్‌కాంత్

చెన్నై: చలనచిత్రనటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కాంత్ అస్వస్థతకు లోనుకావడంతో నగరంలోని ఆసుపత్రిలోచేరారు. డిఎండికె పార్టీ అధ్యక్షుడు కూడా అయిన విజయ్‌కాంత్ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆరోథపెడిక్స్, ట్రౌమటాలజీలోచేరారు. వివిధ శారీరక రుగ్మతల కారణంగా గడచిన కొంతకాలంగా విజయ్‌కాంత్ చికిత్స పొందుతున్నారు. రాత్రి ఎనిమిది గంటలప్రాంతంలో విజయకాంత్‌ను ఆఉపత్రికి తీసుకుని వచ్చారని, వెంటనే ఆయన్ను ఐసియులో చేర్చినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. డిఎండికె పార్టీ వ్యవస్థాపకుడుగా తమిళనాడులో ఓటర్లను ప్రభావితంచేయగలిగిన విజయ్‌కాంత్ గడచిన కొంతకాలంగా అస్వస్థతకు లోనయిన సంగతి తెలిసిందే. అయితే విజయ్‌కాంత్ ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి పుకార్లను నమ్మవద్దని పార్టీ నేతలు ప్రజలకు విజ్ఞప్తిచేసారు. గత ఏడాది మార్చి 2017లో కూడా విజయ్‌కాంత్ తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆయన సింగపూర్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. 2005 సెప్టెంబరు 14వ తేదీ ఆయన డిఎండికెపార్టీని స్థాపించారు. తమిళనాట విజయ్‌కాంత్‌ను కెప్టెన్‌గా పిలుస్తుంటారు. ఈనెల 25వ తేదీనే ఆయన తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. గత ఏడాదిమార్చిలో కూడా శ్వాసకోసవ్యాధులకు సంబంధించి ఆయనకు చికిత్స జరిగింది. విజయ్‌కాంత్‌కు భార్య, ఇద్దరు కుమారులు విజయ్ప్రభావకర్, షన్ముగ పాండియన్లుసైతం తండ్రితోపాటే ఉన్నారు. రెండురోజులపాటు చికిత్స అనంతరం అప్పట్లోఆయన డిశ్చార్జి అయ్యారు. ఆనాడు జరిగే ఆర్కెనగర్కు జరిగిన ఉప ఎన్నికలపరంగా విజయ్‌కాంత్ అస్వస్థతకు లోనుకావడం తమిళనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో డిఎండికెపార్టీ 2011 ఎన్నికల్లో 29 స్థానాలు గెలుచుకుంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఆయన వ్యవహరించారు.