ఐసిఐసిఐ, మ్యాక్స్‌ ప్లస్‌ల జోష్‌!

ICICI BANK
ICICI BANK

న్యూఢిల్లీ: గతంలో విడుదల చేసిన షోకాజ్‌ నోటీసులకు ఐసిఐసిఐ బ్యాంకుతోపాటు సిఇఒ చందాకొచర్‌ సమాధానాలు ఇచ్చినట్లు సెబి తాజాగా తెలియచేయడంతో ఐసిఐసిఐ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 3.4శాతం పెరిగి రూ.332 వద్ద ట్రేడవుతోంది. అయితే సెటిల్‌మెంట్‌కు సంబంధించిన ఎలాంటి దరఖాస్తులూ బ్యాంకు నుంచి, ఏ ఇతర పార్టీల నుంచి దాఖలు కాలేదని వివరించింది. రుణ సెక్యూరిటీల విడుదల ద్వారా నిధుల సమీకరణ ప్రతిపాదనలు ప్రకటించడంతో ప్రైవేట్‌ రంగ కంపెనీ అయితే ఐసిఐసిఐ బ్యాంకు షేర్లు పైపైకి వెళుతున్నాయి. అదేవిధంగా మ్యాక్స్‌ఇండియా, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌ కలిసి ఏర్పాటు చేసిన సంస్థ లైఫ్‌ హెల్త్‌కేర్‌గ్రూప్‌. కాగా మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌లో 49.7శాతం వాటాను రేడియంట్‌ లైఫ్‌కు విక్రయించినట్లు వెల్లడించడంతో మ్యాక్స్‌ ఇండియా షేరు ప్రస్తుతం 4శాతంపైగా పెరిగి రూ.84వద్ద ట్రేడవుతోంది.