ఐసిఐసిఐ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌

ICICI
ICIC

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు రంగ ఐసిఐసిఐ బ్యాంకు సరికొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది.ముఖ్యంగా  కొత్తగా గృహరుణం తీసునే వారికి క్యాష్‌ బ్యాక్‌ను అందించనుంది.మొత్తం రుణంలో ప్రతి ఇఎంఐకి 1 శాతం క్యాష్‌ బ్యాక్‌ను ఇవ్వనున్నట్లు  వెల్లడించింది.కొత్తగా గృహరుణ గ్రహీతలు,అదీ కనీసం 15 సంవత్సరాల పాటు కాలవ్యవధి కలిగిన వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. కాగా 30 సంవత్సరాల పాటు గృహ రుణం తీసుకున్న వారికి సుమారు 10 శాతం సొమ్ము ఆదా అవుతుందని ఐసిఐసిఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌  డైరెక్టర్‌ అనురాగ్‌ బాగ్చి పేర్కొన్నారు.వడ్డీ రేట్లు తక్కువగా ఉండటమే కాకుండా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.వినియోగదారులు పొందనున్నక్యాష్‌బ్యాక్‌ గృహరుణంలో సర్దుబాటు చేసుకోవచ్చు లేదా నేరుగా తమ ఖాతాల్లో జమ చేసేలా అవకాశం కలదు.మొదటి ఇఎంఐ నుంచే క్యాష్‌ బ్యాక్‌ రావడం ప్రారంభమవుతుంది.అయితే 36వ ఇఎఐ కట్టిన తరువాత మొదటి క్యాష్‌ బ్యాక్‌ ఖాతాలో క్రెడిట్‌ అవుతుంది.అక్కడి నుంచి ప్రతి 12 ఇఎంఐకు అప్పటి వరకూ క్యాష్‌బ్యాక్‌ రూపంలో వచ్చిన మొత్తం లభిస్తుంది.30 లక్షల గృహరుణం తీసుకున్న వ్యక్తి 30 సంవత్సరాల పాటు కాల వ్యవధి పెట్టుకుంటే 1 శాతం క్యాష్‌బ్యాక్‌ చొప్పున 3,24,801 తిరిగి పొందుతాడు.అదే 30 లక్షల గృహరుణం 15 సంవత్సరాల
కాలవ్యవధికైతే 96,349 లభిస్తుంది.