ఐసిఎఆర్‌లో ఉద్యోగాలు

ICAR
ICAR

ఐసిఎఆర్‌ ఆధ్వర్యంలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎఎస్‌ఆర్‌ఐ)- గ్రేడ్స్‌ వారీగా ఐటి ప్రొఫెషనల్స్‌ పొస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 16
గ్రేడ్స్‌ వారీ ఖాళీలు: గ్రేడ్‌ 1- 5, గ్రేడ్‌ 2 – 8, గ్రేడ్‌ 3 – 2, గ్రేడ్‌ 4 – 1
అర్హత: గ్రేడ్‌ను అనుసరించి ఇంటర్‌/ పన్నెండో తరగతి ఉత్తీర్ణతతోపాటు డిప్లొమా (సిఎస్‌/ ఐటి/ ఇసిఇ)/ బిసిఏ/ బిఎస్సీ(సిఎస్‌/ ఐటి) పూర్తిచేసి ఉండాలి. లేదా డిగ్రీ పూర్తయిన తరవాత ఏడాది కంప్యూటర్‌ డిప్లొమా /బిఇ/ బిటెక్‌/ ఎంటెక్‌/ పిహెచ్‌డి (సిఎస్‌ఇ/ ఐటి)/ ఎంసిఏ ఉత్తీర్ణులై ఉండాలి. నిబంధనల మేరకు కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయసు: గ్రేడ్‌ 1, 2 పోస్టులకు 35 ఏళ్లు, గ్రేడ్‌ 3, 4 పోస్టులకు 40 ఏళ్లు మించరాదు.
నెలవారీ వేతనం: గ్రేడ్‌ 1 పోస్టులకు రూ.25,000
గ్రేడ్‌ 2 పోస్టులకు రూ.40,000
గ్రేడ్‌ 3 పోస్టులకు రూ.50,000
గ్రేడ్‌ 4 పోస్టులకు రూ.60,000
ఇంటర్వ్యూ తేదీ: నవంబరు 10
వేదిక: ICAR – Indian Agricultural Statistics Research Institute, Library Avenue, Pusa, New Delhi 110012
వెబ్‌సైట్‌: www.iasri.res.in