ఐరాస వేదికగా పాక్‌ తీరుపై మండిపడ్డ భారత్‌

INDO-PAK
INDO-PAK

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితి ఫోరంలో జరిగిన శాంతి సంస్కృతి అనే సదస్సు సాక్షిగా పాకిస్థాన్‌ తీరును భారత్‌ ఎండగట్టింది.
ఈ సదస్సులో భారత శాశ్వత ప్రతినిధి శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాక్‌ను ఘాటుగా
విమర్శించారు. ‘కశ్మీర్‌ భారత్‌లోని అంతర్భాగమనే విషయాన్ని పాకిస్థాన్‌కు గుర్తు చేస్తున్నాను. శాంతి అనేది చిహ్నం మాత్రమే
కాదు. పొరుగుదేశాల మధ్య సత్సంబంధాలు, పరస్పర గౌరవానికి ప్రతీక. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ స్వర్గధామంగా మారిందనే
విషయం అందరికి తెలిసిందే. భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు పాక్‌ వీరిని ఉపయోగించుకుంటోంది. ప్రజాస్వామ్య దేశమైన
భారత్‌ ఉగ్రవాదులు, అతివాదులకు ఎప్పుడూ అనుమతించదు. మహాత్మగాంధీ సిద్ధాంతాలైన ఆహింస, శాంతిని మాత్రమే భారత్‌ ప్రోత్స
హిస్తుంది. ప్రాచీన కాలం నుంచి శాంతికి సంబంధించిన సందేశాన్ని బుద్ధుడు, మహాత్ముడు వంటి ఎంతోమంది ప్రచారం చేశారు అంటూ
ఆయన ప్రసంగించారు.