ఐరాస‌లో పాక్ బుద్ధి మార్చుకోవాల‌ని హిత‌వుః భార‌త్‌

sayed akbaruddin
sayed akbaruddin

న్యూయార్క్ః ఉగ్రవాదులకు స్వర్గధామంగా నిలిచిన వాళ్లు తమ బుద్ధిని మార్చుకోవాలని పాకిస్థాన్‌పై ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ విమ‌ర్శ‌లు చేసింది. ఐరాస భద్రతామండలి ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న భారత శాశ్వత ప్రతినిధి సయీద్‌ అక్బరుద్దీన్ మాట్లాడుతూ… ఉగ్రవాదం కారణంగా అప్ఘనిస్థాన్‌లో శాంతి, స్థిరత్వానికి ప్రమాదం వాటిల్లుతోందని, ఈ ప్రభావం ఆ దేశంలో చాలా అధికంగా ఉందని ఆయన అన్నారు.
ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2003 నుంచి 2014 వరకు ఆ దేశ వార్షిక ఆర్థిక వృద్ధి రేటు 9.6 శాతంగా ఉందని, 2016లో ఉగ్రవాద చర్యలు మరింత అధికంగా ఉండటం వల్ల వృద్ధి రేటు 2.2 శాతానికి దిగజారిందని, 2017లో ఇది 2.6 శాతంగా నమోదైందని అక్బరుద్దీన్ తెలిపారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని, అప్ఘనిస్థాన్‌లో శాంతి నెలకొల్పే విషయంలో భారత్‌ కట్టుబడి ఉందని ప్రకటించారు. అప్ఘనిస్థాన్‌లో ప్రతిరోజు ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని అన్నారు. పాక్ ఇప్పటికైనా తన బుద్ధిని మార్చుకోవాలని పరోక్షంగా చెప్పారు.