ఐఫోన్ల ధరలు తగ్గించే యోచనలో యాపిల్‌

TIM COOK
TIM COOK

శాన్‌ఫ్రాన్సికో: గత కొంత కాలంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐఫోన్‌ విక్రయాలు క్రమంగా తగ్గుతున్నాయని యాపిల్‌ సిఈఓ టిమ్‌కుక్‌ అన్నారు. డాలర్‌ విలువ బలపడటం, బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ తదితర కారణాల వలన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐఫోన్‌ విక్రయాలు పెరగట్లేదని కుక్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కంపెనీ ఆదాయ, వ్యయాల గురించి కుక్‌ మంగళవారం మార్కెట్‌ విశ్లేషకులతో మాట్లాడారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో ధరల మోత ఎక్కువగా ఉందని, డాలర్‌ విలువ పెరగడంతో తమ ఉత్పత్తుల ధర పెరుగుతుందని ఆయన అన్నారు. దీంతో కస్టమర్లు ఐఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపట్లేదు అని కుక్‌ తెలిపారు. విక్రయాలు పెంచేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని, అభివృద్ది చెందుతున్న దేశాల్లో ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.