ఐపిఒలతో రూ.80వేల కోట్లు!

IPO-
IPO-

ఐపిఒలతో రూ.80వేల కోట్లు!

ముంబై, మార్చి 31: 2018 ఫైనాన్షియల్‌ ఇయర్‌ ను ఐపిఒ ఇయర్‌గా చెప్పొచ్చు. ఏడాది మొత్తం మీద 40 కంపెనీలు ఐపిఒకు రాగా రూ.80 వేల కోట్ల నిధులను ప్రైమరీ మార్కెట్‌ నుంచి సమీకరించాయి. ఇందులో సింహభాగం ఇష్యూలు ఇన్వెస్టర్లకు లిస్టింగ్‌ రోజూభారీ లాభా లను పంచాయి. మరికొన్ని కంపెనీలు డిస్కౌం ట్‌తో లిస్టైనప్పటికీ, ఏడాది మొత్తంమీద ఐపిఒ మార్కెట్‌ ఇన్వెస్టర్లను ఆనందంలో ముం చెత్తింది. 2017-18లోఎస్‌ఎంఇలతో కలిపి 190 కంపెనీలు ఐపిఒకు వచ్చాయి. ఇందులో 13 కంపెనీల ఇష్యూ సైజ్‌ రూ.వెయ్యికోట్లు కాగా, మిగిలినవాటా ఇతరకంపెనీలది.

ముఖ్య మైన కంపెనీల విషయానికి వస్తే జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.11,373కోట్లు, న్యూఇండియా అస్యూ రెన్స్‌ రూ.9,600కోట్లు, ఎస్‌బిఐ లైఫ్‌ ఇన్సూ రెన్స్‌ రూ.8,386కోట్లు, బంధన్‌ బ్యాంకు రూ.4,473కోట్లు గతఏడాది ప్రైమరీ మార్కెట్‌ నుంచి భారీగా నిధులను సమీకరించాయి. ఇందులో కొన్ని ఇష్యూలు రెట్టింపు ప్రీమియం తో లిస్ట్‌ కాగా, మిగిలిన కంపెనీలు ఓ మోస్తారు ప్రీమియం, డిస్కౌంట్‌తో బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇల్లో నమోదయ్యాయి. ఇక 2018లో అందరి చూపును తమవైపు తిప్పుకుంది అపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌. 205శాతం ప్రీమి యంతో లిస్టైన ఈ షేరు ఇన్వెస్టర్లను ఆనందం లో ముంచెత్తింది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్‌ లైఫ్‌ కూడా సుమారు 46శాతం ప్రీమియంతో లిస్టై ఇన్వెస్టర్లను ఆనందపరి చింది.

ఇక ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌, డిక్సన్‌ టెక్నా లజీస్‌, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ తదితర కంపెనీలు 30శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. కాని కొన్ని కంపెనీలు మాత్రం ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించాయి. ఇష్యూ ధర అధికంగా ఉండ టంతో ఎస్‌చంద్‌ అండ్‌ కంపెనీ షేరు ఏకంగా 42శాతం డిస్కౌంట్‌తో స్టాక్‌ మార్కెట్లో నమోదైంది. అలాగే కెపాసిట్‌ ఇన్‌ఫ్రా, శాల్‌బై, ఎస్టర్‌ డిఎం హెల్త్‌కేర్‌, మాట్రిమోని డాట్‌కామ్‌, రిలయన్స్‌ నిప్పన్‌లైఫ్‌ ఎఎంసిలు కూడా ఇన్వెస్టరలను లిస్టింగ్‌రోజూ నిరాశపరిచాయి