ఐపిఒలతో మార్కెట్‌లకు జోష్‌!

BSE111
BSE

ఐపిఒలతో మార్కెట్‌లకు జోష్‌!

ముంబయి: దేశీయస్టాక్‌ మార్కెట్లలో వచ్చేవారం ఐపిఒల జోరు కొనసాగనున్నది. ఇన్వెస్టర్లనుంచి లభించే స్పందనతోపాటు విదేశీ మార్కెట్ల తీరు ఆర్ధిక గణాంకాలు కూడా మార్కెట్‌ధోరణులను నిర్దేశి స్తాయి. డాలరు రూపాయి మారకం విలువలు ముడిచమురుధరలు, విదేశీ పెట్టుబడులు వంటివాటికి ఎక్కువ ప్రాధాన్యం ఉటుందని అం చనా. ప్రధానంగా ఐపిఒలమీదనే ఇన్స్టెర్లుఎక్కువదృష్టిసారిస్తారు. మొద టిగా మ్యూజిక్‌బ్రాడ్‌కాస్ట్‌ పబ్లిక్‌ ఇష్యూ మొదలవుతుంది. జాగరణ్‌ ప్రకాశన్‌గ్రూప్‌కు చెందిన సంస్థ ఎఫ్‌ఎంరేడియో బిజినెస్‌ చేస్తోంది. రేడియోసిటీబ్రాండ్‌తో 29 ఎఫ్‌ఎం స్టేసన్లను నిర్వహిస్తోంది. యైపిఒ సోమవారం మొదలవుతుంది. షేరుకు 324-333 ఇష్యూధరగా నిర్ణయించారు. బుధవారం ఎనిమిదవ తేదీతో ముగుస్తుంది.

రిటైల్‌ ఇన్వెస్టర్లుకనీపం 45 షేర్లకు దరఖాస్తుచేసుకోవాలి. ఆపై ఇదే గుణిజా ల్లో రెండులక్షల రూపాయలకు మించకుండా దరఖాస్తుచేసుకోవచ్చు. 2016లో కంపెనీ రూ.245కోట్ల ఆదాయం, రూ.42కోట్ల నికరలా భాలు ఆర్జించింది. ఇష్యూద్వారా కంపెనీ రూ.400 కోట్లకుపైగా సమీ కరించాలని భావిస్తోంది. డీమార్ట్‌ ఐపిఒ కూడా శుక్రవారం ముగు స్తుంది. డీమార్ట్‌ ఐపిఒ బుధవారం ప్రారంభిస్తుంది. ఇష్యూధర 295.299లవరకూ నిర్ణయించారు. ఇష్యూద్వారా డీమార్ట్‌ మాతృసంస్థ ఎవెన్యూ సూపర్‌బమార్ట్స్‌ రూ.1900 కోట్లవరకూ సమీకరించాలని నిర్ణయించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 50షేర్లకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై 50లాట్‌చొప్పున రెండులక్షల మొత్తానికి మించకుండా దరఖాస్తుచేసుకోవచ్చు.

ఈ ఇష్యూపట్ల ఇప్పటికే పబ్లిక్‌లో క్రేజ్‌ ఏర్పడటం ప్రస్తావించదగ్గ అంశం. గ్రేమార్కెట్‌లో రూ.180వరకూ ప్రీమియం ధరలకు వస్తోంది. కంపెనీ 41 పట్టణాల్లో 112స్టోర్లు నిర్వ హిస్తోంది.స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల్లో సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝన్‌ఝన్‌వాలాకే గురువుగా అభివర్ణిఇంచే రాధామకృష్ణన్‌ ధమాని డీమార్ట్‌ వ్యవస్థాపకులుకాగా 2016లో కంపెనీ 8606 కోట్ల టర్నోవర్‌ తోను, రూ.321 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. మార్కెట్లు ముగిసిన తర్వాత పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు విడుదలవుతాయి. డిసెంబరునెలలో ఐఐపి 0.4శాతం క్షీణించింది.శనివారం ఉత్తరప్రదేశ్‌ సహా పంజాబ్‌ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. వీటిపై అంచనాలు కూడా మార్కెట్‌ సెంటి మెంట్‌ను ప్రభావితంచేస్తాయి. ప్రభుత్వం తీసుకువచ్చే కీలక బిల్లులకు ఆమోదం పొందాలంటే రాజ్యసభలోనూ బిజెపి కూటమి బలాన్ని పెంచుకోవాల్సి ఉంది. కాగా పార్లమెంట్‌ బడ్జెట్‌ సెషన్‌ ద్వితీయ అంకం 9న ప్రారంభం అవుతుంది. 12న ముగియనున్న సమావేశాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిపెట్టే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెపుతున్నారు. ఇక విదేశీ అంశాల విషయానికి వస్తే ఈనెల 14-15 తేదీల్లో అమెరికా సెంట్రల్‌బ్యాంకు ఫెడరల్‌ రిజర్వు విధాన సమీక్ష చేపడుతుంది. మరో సారి వడ్డీరేట్ల పెంపుసంకేతాలు కనిపిస్తున్నాయి. ఫెడ్‌రేట్ల పెంపు చేప డితే భారత్‌లాంటి వర్ధమానదేశాల మార్కెట్లనుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్లే ఆందోళనలు తలెత్తుతాయి. ఇది దేశీయంగా సెంటిమెం ట్‌ను బలహీనపరిచే వీలుంటుందని మార్కెట్‌ నిపుణుల అంచనా.