ఐపిఒలతో ఇన్వెస్టర్లకు బంపర్‌ ఆఫర్‌!

IPO
IPO

న్యూఢిల్లీ: ఐపిఒలకు 2017 బాగా కలిసి వచ్చింది. ఒకరకంగా ఈ సంవత్సరంలో ఐపిఒల జాతరే జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం 153 ఐపిఒలు రాగా 1200కోట్ల డాలర్ల నిధులు కంపెనీలు సేకరించాయ్‌. ఆ ఐపిఒల్లో టాప టెన్‌ కంపెనీలను ఇప్పుడు చూద్దాం. దాదాపు 75వేల కోట్ల రూపాయలు ఐపిఒల రూపంలో స్టాక్‌ మార్కెట్లలోకి ప్రవహించాయ్‌. 153 కంపెనీలు ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ కింద ఇన్వెస్టర్లను పలకరించగా వాటిలో 22 ఒక్క డిసెంబరులోనే రావడం గమనార్హం. వీటన్నింటిలో జనరల్‌ ఇన్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియానే 1.7బిలియన్‌ డాలర్లు అంటే రూ.11వేల 175కోట్లు జిఐసి సేకరించింది. ఇష్యూపరంగా ఇదే 2017లో అతిపెద్ద ఐపిఒ. అక్టోబర్‌ 25న లిస్టైన ఈ కంపెనీ షేరు రూ.912వద్ద కేటాయించగా, లిస్టింగ్‌ రూ.850వద్ద 5శాతం నష్టంతో జరిగింది.ప్రస్తుతం కూడా 760-780 మధ్యలోనే కదలాడుతోంది. ఇష్యూ సైజ్‌పరంగా రెండో కంపెనీ న్యూ ఇండియా అస్యూరెన్స్‌ రూఏ.9466కోట్ల సేకరణతో నవంబరు 13న లిస్టైంది. అలాట్‌ చేసిన రేటు రూ.800కాగా, ఇది కూడా 9శాతం నష్టాలతోనే రూ.748వద్ద లిస్టైంది. ప్రస్తుతం రూ.605-610మధ్యనే కదలాడుతోంది స్టాక్‌.

హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్‌ లైఫ్‌ రూ.8695కోట్ల సమీకరణ కోసం ఐపిఒకి రాగా రూ.290వద్ద షేర్లు అలాట్‌ అయ్యాయి. లాస్టింగ్‌ 19శాతం ప్రీమియంతో రూ.311వద్ద జరిగింది. ఇప్పుడు మాత్రం రూ.375 దరిదాపుల్లో ట్రేడవుతోంది. అంటే లాభాలు పంచిన ఐపిఒగా చెప్పుకోవచ్చు. ఎస్‌బిఐ లైఫ్‌ ఇన్యూరెన్స్‌ రూ.8386కోట్ల చిలుకు నిధుల సేకరణతో ఇష్యూకి రాగా, షేర్లను రూ.700ధరవద్ద కేటాయింపు జరిగింది. లిస్టింగ్‌ రోజున కేవలం అరశాతం లాభంతో రూ.733.30వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. గత వారం రోజులుగా కూడా 690-700మధ్యనే ట్రేడవుతోంది. ఐసిఐసిఐలంబార్డ్‌ రూ.5700కోట్ల ఇష్యూ సైజ్‌తో రూ.661వద్ద షేర్ల కేటాయింపులు జరిగాయ్‌. ఇది కూడా లిస్టింగ్‌ రోజున నిరాశపరిచి రూ.650వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. అయితే ట్రేడింగ్‌ ముగిసేసమయానికి మాత్రం 3శాతం లాభపడింది. గతవారం రోజుల్లో రూ.790 వరకూ వెళ్లడం విశేషం. అలా ఈ ఐపిఒ కూడా ఓ మోస్తరు లాభాలు పంచిన స్టాక్‌గా చెప్పుకోవచ్చు.

ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్‌ థీమ్‌తో వచ్చిన ఐఆర్‌బి ఇన్విట్‌ ఫండ్‌ రూఏ.5,032 కోట్ల నిధుల సేకరణ కోసం ఇష్యూకి వచ్చింది. మే 18న లిస్టైన ఈ షేర్లు ఇష్యూ ధర అయిన రూ.102 కంటే ఒక్క రూపాయి ఎక్కువగా రూ.103.25 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించుకుంది. ప్రస్తుతం మాత్రం రూ.88 దరిదాపుల్లో లావాదేవీలు జరుగుతున్నా§్‌ు. అంటే లిస్టింగ్‌ కంటే 25శాతం నష్టాలు నమోదు చేసిందని చెప్పుకోవచ్చు. ఇండియా గ్రిడ్‌ ట్రస్ట్‌ అనే మరో ఐపిఒ కూడా దాదాపు 2250కోట్ల నిధుల సేకరణ కోసం స్టాక్‌ మార్కెరట్లను పలకరించింది. ఇష్యూ ధర అయిన రూ.100వద్దే లిస్టైంది. ఆ తర్వాత కూడా పెద్దగా కదలిక లేకుండా రూ.94-95మధ్యే ట్రేడవుతోంది. రూ.1912కోట్ల నిధుల సేకరణ కోసం వచ్చిన ఏయు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు మాత్రం ఇన్వెస్టర్లకు ట్రేడర్లు లాభాల పంట పండించింది. రూ.358వద్దకేటాయింపు జరిగిన ఈ సంస్థ షేర్లు జూలై 10న రూ.525ధర వద్ద లిస్టైయ్యాయి. ప్రస్తుతం రూ.680-690ట్రేడవుతోన్న ఈ కంపెనీ షేరు ఓ దశలో రూ.737ని కూడా తాకడం విశేషం.

ఇక మరో రిటైల్‌ మార్ట్‌ దిగ్గజం అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ ఐపిఒలకి క్రేజ్‌ తెచ్చిన సంస్థగా ఇన్వెస్టర్ల మదిలో నిలిచిపోయింది. రూ.1870కోట్ల నిధుల సేకరణకోసం వచ్చిన ఈ సంస్థ కేటాయింపు ధర రూ.299. మార్చి 21న స్టాక్‌ మార్కెట్‌లో రూ.604 వద్ద లిస్టై పండగ చేసింది. ఆ తర్వాతా జైత్రయాత్ర సాగిస్తూ వెయ్యి రూపాయల మార్క్‌ కూడా దాటిపోయింది. రూ.1289గరిష్టాన్నీ తాకింది. ప్రస్తుతం రూ.1150-1160మధ్య ట్రేడవుతోంది. మార్కెట్‌ కేపిటలైజేషన్‌ కూడా రూ.71వేల 770కోట్లకి చేరడం విశేషం. ఒక్క ఏడాదిలోనే ఈ స్థాయి రిటన్స్‌ ఇవ్వడం ఈ కంపెనీ అనుసరిస్తోన్న వ్యూహాలే కారణం. ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ రూ.1741కోట్ల నిధుల సేకరణ కోసం ఐపిఒకి రాగా, రూ.603 వద్ద షేర్లు ఇన్వెస్టర్లకు కేటాయించారు. జూన్‌ 29న స్టాక్‌ మార్కెట్‌లో రూ.612 వద్ద ఈ సంస్థ షేర్లు లిస్టయ్యాయి. 52 వారాల గరిష్టమైన రూ.830కి కూడా చేరింది. ప్రస్తుతం రూఏ.790-800మధ్యలో ట్రేడవుతోంది. పైన పేర్కొన్న లెక్కలన్నీ చూస్తే, మంచి వేల్యేషన్‌తో అంచనాలతో వచ్చిన కంపెనీలు మాత్రం ఓ మాదిరిగా రాణించగా, జనంలోకి వెళ్లిన రంగాల్లోకి షేర్లు మాత్రం బ్రహ్మాండంగా వర్కౌట్‌ అయినట్లు గమనించవచ్చు.