ఐపిఒకు వస్తున్న మిశ్రధాతు నిగమ్‌

IPO
IPO

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధాని) నిధుల సమీకరణ కోసం ఐపిఒకు రాబోతోంది. ఈ నెల 21న ప్రారంభమై 23న ముగిసే ఈ ఇష్యూ ద్వారా 26శాతం వాటాకు సమానమైన 4,68,35,000షేర్లను విక్రయించి రూ.438 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఇటీవల వచ్చిన ఐపిఒలతో పోలిస్తే ఈ ఇష్యూ ప్రైస్‌ బాండ్‌ అతితక్కువగాఉంది. ఇష్యూ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.87-90గా కంపెనీ నిర్ణయించింది. ఒక లాట్‌సైజ్‌ 150 షేర్లు కాగా, రిటైల్‌ ఇన్వెస్టర్లకు, కంపెనీ ఉద్యోగులకు ఒక్కో షేరుకు రూ.3 డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ ఇష్యూకు ఐడిబిఐ కేపిటల్‌ మార్కెట్‌ సర్వీసెస్‌, ఎస్‌బిఐ కేపిటల్‌ మార్కెట్స్‌ లీడ్‌ మేనేజర్స్‌గా ఉన్నాయి. 1973లో హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభమైన మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ ప్రత్యేక ఉక్కు, సూపర్‌ అలా§్‌ులు, టైటానియం అల్లా§్‌ు ఉత్పత్తిదారు. భారత్‌లో టైటానియం అలా§్‌ు్సను తయారు చేస్తోన్న ఏకైక కంపెనీ ఇదే కావడం విశేషం. రక్షణ, అంతరిక్ష, విద్యుత్‌ రంగాల్లోని కంపెనీలకు అవసర ఉత్పత్తులను, మిశ్రధాతువులను తయారుచేస్తోంది ఈ సంస్థ. ప్రస్తుతం హైదరాబాద్‌లో మ్యానుఫ్యాక్షరింగ్‌ ఫెసిలిటీని కలిగి ఉన్నఈ సంస్థ, రోహ్‌తక్‌, నెల్లూరులో రూ.100కోట్ల పెట్టుబడితోకొత్త ప్లాంట్లను నిర్మిస్తోంది. సంస్థ మొత్తం ఆర్డర్లలో 71.56శాతం కేంద్రం రక్షణ సంస్థల నుంచి, మిగతాది వాహన, రైల్వేల నుంచి వస్తోంది. ఇందులో మెజార్టీ రెవెన్యూ ఐదు సంస్థల నుంచే అందుతోంది. గత మూడేళ్లుగా మొత్తం ఆదాయంలో ఈ ఐదు సంస్థల నుంచి వాటా వరుసగా 64.75శాతం, 70.29శాతం, 65.80శాతం. జనవరి 31,2018నాటికి కంపెనీ మొత్తం ఆర్డర్‌ బుక్‌ రూ.517కోట్లు. ఇందులో రూ.283కోట్లు డిఫెన్స్‌ నుం,ఇ రూ.168కోట్లు స్పేస్‌నుంచి, రూ.66కోట్లు ఇతర రంగాల నుంచి వచ్చింది. సంస్థకు అవసరమైన ముడి సరుకులో 53.66శాతం దిగుమతి చేసుకుంటుండగా, 46.34శాతం లోకల్‌గా సేకరిస్తోంది. గత ఐదేళ్లుగా ఈ సంస్థ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. 2016-2020మధ్య కాలంలో భారత ఏవియేషన్‌ రంగంలో 15 బిలియన డాలర్ల పెట్టుబడి వచ్చే అవకాశాలున్నాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఇందులో ప్రైవేట్‌ రంగంలో 10 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టే చాన్స్‌ వుంది. అలాగే 300 బిజినెస్‌ జెట్‌లు, 300స్మాల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, 250 హెలికాప్టర్స్‌ కోసం వెచ్చించే పెట్టుబడి దీనికి అదనం. దీంతో స్పెషాలిటీ స్టీల్‌, సూపర్‌ అలా§్‌ు్స, టైటానియం అలా§్‌ు్సకు భారీ డిమాండ్‌ ఏర్పడనుంది. దేశంలో టైటానియం అలా§్‌ు్సను తయారుచేసే కంపెనీ కావడం ఈ సంస్థకు ప్లస్‌ పాయింట్‌గా చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో ఈ సంస్థ మెరుగైన వృద్ధిని నమోదు చేయవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.