ఐపిఎల్ హంగామా మొద‌లు

IPL
IPL

న్యూఢిల్లీః వచ్చే ఐపీఎల్ కోసం కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు న్యూ జెర్సీని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి ఫ్రాంచైజీ సోషల్ మీడియా ఖాతాల నుంచి లైవ్ టెలికాస్ట్ చేసింది. గత ఐపీఎల్‌ ఎడిషన్‌లో ఉపయోగించిన ఎరుపు, సిల్వర్ రంగులనే ఈ జెర్సీలోనూ ఉపయోగించింది. అయితే ముందటి భాగంలో సిల్వర్ కలర్ షేడ్‌ను కొంత తగ్గించింది. జెర్సీ వెనకవైపు కూడా పరిమితంగా రంగులు ఉపయోగించింది. ముందువైపు చాతీ కింద నీలి రంగు ఎంబ్లమ్‌లో గర్జిస్తున్న సింహం బొమ్మ ఉంది. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌కు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ ఈ సీజన్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా వీరేంద్ర సెహ్వాగ్ మెంటార్‌గా ఉన్నాడు.