ఐపిఎల్ టికెట్ల అమ్మ‌కాలు మొద‌లు

IPL
IPL

ముంబయి: క్రికెట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టిక్కెట్ల అమ్మకాలు మొదలయ్యాయి.
ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా తొలి మ్యాచ్ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలకు కౌంటర్లు తెరచినట్లు ముంబయి ఫ్రాంఛైజీ ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ఆన్‌లైన్లో www.mumbaiindians.com ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయొచ్చని మీడియాకు వెల్లడించింది. టిక్కెట్ల ధరలు కనిష్ఠంగా రూ.800 నుంచి గరిష్ఠంగా 8,000 మధ్య వివిధ స్థాయిల్లో ఉన్నాయి. సొంత మైదానంలో ముంబయి ఇండియన్స్ ఆడే మ్యాచ్‌ల టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఏప్రిల్ 14న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచ్ టిక్కెట్లను రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక బాధ్యతలో భాగంగా అందరికీ విద్య-అందరికీ క్రీడలు ఉద్దేశంతో అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ కోసం రిజర్వ్ చేసినట్లు పేర్కొంది.