ఐపిఎల్ ఆపాలంటూ హైకోర్టులో పిల్‌

 IPL
IPL

చెన్నైః ఈ ఏడాది ఐపీఎల్ జరగకుండా ఆపాలంటూ మద్రాస్ హైకోర్టులో ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఐపీఎల్‌లో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ జరగకుండా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని, అందువల్ల ఈ ఏడాది ఐపీఎల్‌ను జరపకూడదని సంపత్‌కుమార్ అనే ఆ అధికారి కోరారు. ఐపీఎల్‌లో ఆడే 8 జట్లను ఇందులో ప్రతివాదులుగా ఆయన చేర్చారు. ఓ విచారణ అధికారిగా తాను ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌ను బయటపెట్టానని ఆ పిల్‌లో సంపత్ పేర్కొన్నారు.