ఐపిఎల్‌లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా హవా

s2

ఐపిఎల్‌లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా హవా

న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ల హవా కనిపిస్తుంది.భవిష్యత్‌లో ఆసీస్‌ క్రికెటర్ల జోరు ఎక్కువగా నడిస్తుందా? అని ఐపిఎల్‌ జట్లకు ఆసీస్‌ ఆటగాళ్లే కెప్టెన్లుగా ఉండే విధంగా పరిస్థితి మారిపోతుందా అనే అను మానాలు కలుగుతున్నాయి.ఇప్పటికే రెండు జట్లకు ఆసీస్‌ ఆటగాళ్లే రథసారథులుగా ఉండగా ఇప్పుడు మూడవ జట్టుకు కూడా ఆసీస్‌ ఆటగాడే శరణ్యమైపోయాడు.దీన్నంతాచూస్తుంటే ఐపిఎల్‌ పేరు కూడా ఎపిఎల్‌ (ఆస్ట్రేలియా ప్రీమియర్‌ లీగ్‌) అని మారిపోతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఐపిఎల్‌ పదవ సీజన్‌ కోసం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు కొత్త కెప్టెన్‌ను నియమించింది. మురళీ విజ§్‌ు స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన గ్లేన్‌ మ్యాక్స్‌వెల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇప్పటికే ఆసీస్‌కు చెందిన డేవిడ్‌ వార్నర్‌ సన్‌ రైజర్స్‌ కెప్టెన్‌గా ఉండగా, పుణే జట్టు ధోనీ స్థానంలో స్టీవ్‌ స్మిత్‌కు బాధ్యతలు అప్పగిం చింది. కెప్టెన్‌గా మ్యాక్స్‌వెల్‌ను నియమించిన విషయాన్ని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించింది.ఆ జట్టు ప్రధాన కోచ్‌ సెహ్వాగ్‌కూడా ఈ విషయాన్ని ట్వీట్‌ చేశాడు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌,వెస్టిండీస్‌ ప్లేయర్‌ డారెన్‌ సమీతో పాటు దక్షిణాఫ్రికా ప్లేయర్‌ హషీమ్‌ అమ్లాను కాదని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మాక్స్‌వెల్‌కు బాధ్యతలు అప్పగిం చడం విశేషం.భుజం గాయం కారణంగా మిగతా రెండు టెస్టులకు దూరమైన మార్ష్‌ స్థానంలోకి వచ్చేందుకు మ్యాక్స్‌వెల్‌ ప్రయత్నిస్తున్నాడు.