ఐదోరోజూ నష్టాలే

bse1

ఐదోరోజూ నష్టాలే

ముంబయి,ఆగస్టు 12: దేశీయ మార్కెట్‌సూచీలు వరుసగా ఐదోరోజు కూడా నష్టాల్లోనేముగిసాయి. గడచిన ఏడాదిన్నరకాలంలో మార్కెట్లు అత్యంత అధ్వాన్నంగా పనితీరుచూపించిన వారంగా కూడా చెప్పుకోవచ్చు. భారతీయ స్టేట్‌బ్యాంకు ఆర్ధికఫలితాలునిరాశకలిగించడం, ఉత్తరకొరియా ఉద్రిక్తతలతో మార్కెట్లు కొంతమేర సెంటిమెంట్‌ నీరసించిందని చెప్పాలి.

యూరోప్‌తో సహా ఆసియా మార్కెట్లు అన్నీ కూడా అమ్మకాలతో కుదేలయ్యాయి. దేశీయంగా కూడా సెంటిమెంట్‌కు దెబ్బతగలడంతో మార్కెట్లు భారీగా పతనం చెందాయి. ట్రేడింగ్‌ముగిసేనాటికి సెన్సెక్స్‌ 318 పాయింట్లు పతనం అయి 31,213 వద్ద నిలిస్తే నిఫ్టీ సూచీ 109 పాయింట్లు క్షీణించి 9711వద్ద ముగి సింది. ఉత్తరకొరియా అమెరికామధ్య కమ్ముకుం టున్న యుద్ధమేఘాలతో ప్రపంచ వ్యాప్తంగా అమ్మ కాలు జోరందుకున్నట్లు నిపుణులు చెప్పారు. కాగా ఇంట్రాడేలో సాంకేతిక నిపుణులు కీలకంగా భావించే 9700 స్థాయిని నిఫ్టీ కోల్పోవడం ప్రస్తావించదగ్గ అంశం. ఎన్‌ఎస్‌ఇలో అన్ని రంగాలు డీలాపడ్డాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో భారీగా అమ్మకాలు జరిగాయి.
పిఎస్‌యు బ్యాంక్‌సూచీ ఐదుశాతం దిగజారింది. ఇదేబాటలో మెటల్‌ 3.4శాతం, ఆటో 14శాతంచొప్పున పతనం అయ్యాయి. నిఫ్టీ దిగ్గజాల్లో హిందాల్కో, వేదాంత, స్టేట్‌బ్యాంకు, బ్‌ో,బ్యాంక్‌ ఆఫ బరోడా, ఎంఅండ్‌ఎం, జీ, సన్‌ఫార్మా, ఒఎన్‌జిసి, రిల్‌ సంస్థలు 2.5 నుంచి 6.7శాతంమధ్య పతనం అయ్యాయి. అమ్మకాల తీవ్రత ఏస్థాయిలో ఉందో ఇట్టే అవగతం అవుతు న్నది. డాక్టర్‌ రెడ్డిస్‌, అరబిందో, గెయిల్‌, బిపిసిఎల్‌, ఎస్‌బ్యాంకు, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌, విప్రో, అల్రాటెక్‌, 0.5నుంచి నాలుగుశాతం మధ్య బలపడ్డాయి. మార్కెట్ల బాటలో చిన్నర్లుే డీలాపడ్డాయి. బిఎస్‌ఇలోడ్రేడ్‌ అయిన మొత్తం ర్లేలో 1549 న్టపోతే 979 లాభపడ్డాయి. ఎఫ్‌ఐఐల అమ్మకాలుకూడా నగదువిభాగంలో ముందు రోజు రూ.841కోట్ల పెట్టుబడులను వెనక్కు తీసుకున్న విదేశీఇన్వెస్టర్లు గురువారం కూడా రూ.1171 కోట్లకుపైగా స్టాక్స్‌ విక్రయించారు. బుధ వారం రూ.553కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టిన దేశీయ ఫండ్స్‌సంస్థలు గురువారం రూ.872 కోట్ల విలువైన స్టాక్స్‌ను కొనుగోలుచేశారు.