ఐదు శాతం పెరిగిన ఇళ్ల ధ‌ర‌లు!

houses
houses

హైదరాబాద్‌: ఈ ఏడాది జులై-సెప్టెంబర్‌ మధ్య హైదరాబాద్‌ సహా దేశంలోని ఎనిమిది నగరాల్లో ఇళ్ల ధరలు 2శాతం పెరిగినట్టు ఓ సంస్థ వెల్ల‌డించింది. ఇదే సమయంలో ఇంటి అద్దెలో 5శాతం పెరుగుదల నమోదైందని వెల్లడించింది. ఎనిమిది మెట్రో నగరాల్లో స్థిరాస్తి మార్కెట్‌ స్థితిగతులపై త్రైమాసిక నివేదిక విడుదల చేసిన ఆ సంస్థ కొన్నేళ్లుగా స్థిరాస్థి రంగం నెమ్మదించిందని తెలిపింది. దీని వల్ల అమ్మకాలు క్షీణించడం సహా గృహనిర్మాణ ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నట్టు వెల్లడించింది. గృహనిర్మాణ రంగం నెమ్మదించడం వల్ల ధరలు పడిపోవడం లేదా స్థిరంగా ఉంటున్నాయని తెలిపింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే జులై-సెప్టెంబర్‌లో బెంగళూరులో ఇళ్ల ధరలు ఒక శాతం పడిపోగా, అద్దెలు 3శాతం పెరిగినట్టు తెలిపింది.