ఐదు రాష్ట్రాల్లో బిజెపికే అనుకూలం

modi, pm
modi, pm

అయితే సీట్లసంఖ్య తగ్గుతాయన్న సర్వే
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు మరెంతో కాలం లేదు. సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు తమతమ అజెండాలతో సిద్ధం అవుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే తన ఎన్నికల ర్యాలీలను షురూచేసారు. యుపిలో మాయావతి ఆధ్వర్యంలోని బిఎస్‌పి, అఖిలేష్‌యాదవ్‌పార్టీ ఎస్‌పిలు ఎన్నికల టైప్‌కు వచ్చాయి. బీహార్‌లో బిజెపి, జెడియు పొత్తులు కుదిరాయి. ఇక్కడ 40 స్థానాలకుగాను రెండుపార్టీలు 17 చొప్పునపోటీచేస్తామని,మిగిలినవి ఇతర మిత్రపక్షాలకు ఇస్తామంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న దశలో బిజెపి మళ్లీ అధికారంలోనికివస్తుందా విపక్షాలన్నీ ఏకమైకాంగ్రెస్‌ పార్టీకి పట్టం కడతారా అన్న పరిస్థితులపై మూడోకూటమి చక్రం తిప్పుతుందా అన్న చర్చ సాగుతున్నది ఈనేపథ్యంలో ఇండియా టివి సిఎన్‌ఎక్స్‌ అభిప్రాయసర్వేలో బిజెపికే మొగ్గు కనిపించింది. బీహార్‌,మహారాష్ట్ర, జార్ఖండ్‌, గోవా, ఉత్తరప్రదేశ్‌లలో ఇపుడు ఎన్నికలు జరిగితే పలితాలు కమలనాధులకు సానుకూలంగా ఉన్నాయి. యుపిలో 80 సీట్లకుగాను బిజెపికి 40 సీట్లు, బిఎస్‌పికి 15, ఎస్‌పికి 15 వస్తాయి. కాంగ్రెస్‌కు రెండుసీట్లే వస్తాయని అంచనావేసింది. ఓట్ల వాటా కూడా బిజెపికి 37శాతం, బిఎస్‌పికి పది, ఎస్‌పీకి 23శాతం, కాంగ్రెస్‌ పార్టీకి పదిశాతం, ఇతరులకు 11శాతం ఉంటాయని అంచనావేసింది. ఇక బీహార్‌లో మొత్తం 27 సీట్లు గెలుస్తుందని వెల్లడించింది. బిజెపి 13, జెడియు 11, కాంగ్రెస్‌రెండు, ఆర్‌జెడి పదిసీట్లు ఉంటాయనిఅంచనా. ఇతరులు నాలుగుసీట్లు గెలుచుకుంటారని తేల్చింది. ఎన్‌డిఎకు 27 సీట్లువస్తుంటేమహాకూటమికి 13సీట్లే వస్తాయి. బిజెపికి 22శాతం, కాంగ్రెస్‌కు 8శాతం, ఆర్‌జెడికి 25శాతం జెడియుకుఇ 20శాతం ఇతరులకు 25శాతం ఓట్లు లభిస్తాయని అంచనావేసింది. ఇక మహారాష్ట్రలోని 48స్థానాల్లో బిజెపికి 22, కాంగ్రెస్‌కు తొమ్మిది, శివసేన 8, ఎన్సీపి తొమ్మిదిస్థానాల్లో గెలుస్తుందని సర్వే వెల్లడించింది. ఓట్ల పరంగా బిజెపికి 28, కాంగ్రెస్‌కు 19, శివసేనకు 18శాతం, ఎన్‌సిపికి 18శాతం, ఇతరులతకు 17శాతం వాటా ఉంటుందని తేల్చింది. 2014లో బిజెపి 23సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక జార్ఖండ్‌ గోవాల్లోకూడా బిజెపికే గాలివీస్తోంది. జార్ఖండ్‌లో 14సీట్లకుగాను బిజెపికి ఏడు, కాంగ్రెస్‌కు రెండు, జార్ఖండ్‌ముక్తిమోర్చాకు నాలుగు,జార్ఖండ్‌ వికాస్‌మోర్చాకు ఒకసీటు వస్తుందని ప్రీపోల్‌సర్వే తెలిపింది. 2014లో బిజెపి 12స్థానాలు గెలుచుకుంటే కాంగ్రెస్‌ ఒక్కసీటుకూడా గెలవేలుద. ఇక గోవాలో రెండుసీట్లు ఉంటే కాంగ్రెస్‌ బిజెపిలు చెరొకస్థానం గెలుస్తాయని ప్రకటించింది. ఓట్లశాతంపరంగా బిజెపి 49శాతం, కాంగ్రెస్‌ పార్టీకి 43శాతం, ఇతరులకు ఎనిమిదిశాతం ఓట్లు రానున్నాయి. మొత్తంగా ఈఐదు రాష్ట్రాల్లో కలిసి బిజెపికే ఎక్కువ సీట్లు వస్తాయని తేల్చింది. కానీ గతంలోకంటే సీట్లు తగ్గనున్నాయి. ఒక యూపిలోనే 71సీట్లుగెలిస్తే ఇపుడు ఐదురాష్ట్రాల్లో కలిపి 83కుపైగా మాత్రమే సీట్లు వస్తాయని సర్వేలో తేలింది.