ఐదుగురి మృతిపై వివ‌ర‌ణ ఇచ్చిన సీపీ శాండిల్య‌

sandeep sandilya
sandeep sandilya

హైదరాబాద్: నార్సింగ్ సమీపంలోని కొల్లూరులో దొరికిన ఐదు మృతదేహాలకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా మీడియాకు తెలియజేశారు. ఉదయం సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ముందుగా ముగ్గురు మహిళల మృతదేహాలు లభించాయని, వెంటనే సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా సమీపంలో కారులో ఓ వ్యక్తి, చిన్నారి మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపారు. వారు విషం తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. కాగా వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అయితే ఇది ఆత్మహత్యా కాదా అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని సీపీ అన్నారు. గత రాత్రి అమీన్‌పూరాలో మిస్సింగ్ కేసు నమోదు అయ్యిందని, వాటర్ ఫాల్స్‌ చూడటానికి వెళ్లిన కుటుంబసభ్యులు కనిపించకుండా వెళ్లారని తమకు ఫిర్యాదు వచ్చినట్లు సీపీ తెలిపారు. బంధువులు వచ్చి మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.