‘ఐతే 2.0’ పాట విడుదల

AYITAE-2
MM Keerawani

‘ఐతే 2.0’ పాట విడుదల

ఇంద్రనీల్‌ సేన్‌ గుప్తా, జారాషా, అభిషేక్‌ , కర్తవ్యశర్మ, నీరజ్‌, మృఫాల్‌, మృదాంజలి కీలకపాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఐతే 2.0 ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ నల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. మార్చి 16న ఈచిత్రం విడుదల కానుంది.. ఈసినిమాలో నింగిపై అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి విడుదలచేశారు. ఆ కార్యక్రమంలో కల్యాణ్‌ మాలిక్‌, చిత్ర దర్శకుడు రాజ్‌ మాదిరాజు, సంగీత దర్శకుడు అరుణ్‌చిలువేరు, నరేశ్‌ అయ్యర్‌ పాల్గొన్నారు.
కీరవాణి మాట్లాడుతూ, సాంగ్‌ విన్నానని, చాలా కొత్తగా అన్పించిందన్నారు. ఈసినిమాకు సంగీతం అందించిన అరుణ్‌ చిలువేలు అద్భుతమైన మెలొడీ మ్యూజిక్‌ను అందించగలరన్నారు. తను గిటారిస్ట్‌గా పనిచేస్తున్నప్పటి నుంచి తనకు తెలుసునని అన్నారు. క్యాణ్‌ మాలిక్‌ మాట్లాడâత, ఐతే సినిమాకు తానే మ్యూజిక్‌ కంపోజ్‌ చేశానని, ఆ సినిమాలో ఒకే ఒక సాంగ్‌ ఉంటే దాన్ని అన్నయ్య కీరవాణి గారు పాడారన్నారు.. సంగీత దర్శకుడు అరుణ్‌ మాట్లాడుతూ, కీరవాణిగారి చేతులమీదుగా పాట విడుదల కావటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దర్శకుడు రాజ్‌ మాట్లాడుతూ, మూడు సాంగ్స్‌ ఉన్నాయని, ఇందులో ముగ్గురు హీరోలకు సంబంధఙంచిన వివిధ నేపథ్యౄల్లో ఈ మూడుపాటలుంటాయన్నారు. ఆకలి , ఆశ, కోసం అనే మూడు అంశాలపై పాటలు ఉంటాయన్నారు. నిర్మాత విజ§్‌ు మాట్లాడుతూ, మార్చి 16న ఈచిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.