ఐటెం.. అవతారంలో మిల్కీ అదుర్స్‌…

tamanna-bhatia
మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గానే కాదు..ఏ రోల్‌లో అయినా ఇరగదీస్తుంది.. ఐటెం భామగగా మెరిసేందుకు ఏమాత్రం అబ్జెక్షన్‌ చేయని ఈసుందరి.. టాలెంట్‌ చూపించేందుకు గట్టిగా వసూలు చేస్తుంది.. కానీ అడిగిన రోల్‌ని అంగకీరించేస్తుంది.. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌ స్పీడున్నోడు చిత్రాన్ని చేస్తున్నారు. భీమినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈమూవీ ఓ తమిళ చిత్రానికి రీమేక్‌… స్పీడున్నోడులో ఓ స్పెషల్‌ అంటే స్పెషల్‌ అని చెప్పదగ్గ ఐటెం సాంగ్‌లో తమ్మూ తళుకులు చూపిస్తోంది…గతంలోనూ ఈబెల్లంకొండతో ఐటెం చేసిన అనుభవం ఉండటంతో ఈసారి కొంచెం ఎక్కువగానే చిందులేసింది.. మిల్కీ డ్రెస్సింగ్‌ నుంచి డ్యాన్సుల వరకూ బాగా చితక్కొట్టేసిందని సినిమా వర్గాలు చెప్పకుంటున్నాయి…