ఐటీ కంపెనీల ఏర్పాటుకు సకల వసతులు

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ పరిశ్రమ విస్తరిసోంది. నేడు అమరావతిలో 10ఐటీ కంపెనీలను మంత్రి నారా లోకేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద ఐటీ కంపెనీలు ఎంత ముఖ్యమో చిన్న, మధ్యతరగతి కంపెనీలు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం సకల వసతులు కల్పిస్తోందని చెప్పారు. రాయితీలను సకాలంలో ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పాలసీలను రూపొందించామని చెప్పారు. ఐటీ రంగానికి అవసరమయ్యే విధంగా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఇస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.