ఐటీ అభివృద్ధికి ఆఫీస్‌ స్పేస్‌ ఆటంకంగా మారింది: మంత్రి లోకేశ్‌

Lokesh
Lokesh

అమరావతి: ఐటీ అభివృద్ధిపై మంత్రి లోకేశ్‌ సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ ఐటీ అభివృద్ధికి ఆఫీస్‌ స్పేస్‌ కొరత ఆటంకంగా మారిందని, లక్ష ఐటీ ఉద్యోగాలు రావాలంటే కోటి చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ కావాలని అన్నారు. టీడీపీ పాలసీ ద్వారా ప్రపంచ స్థాయి మౌలిక  వసతులతో ఆఫీస్‌ స్పేస్‌ ఉండాలని, 50 రోజుల్లో అన్ని అనుమతులు ఇవ్వగలుగుతున్నామని ఆయన వెల్లడించారు. రాబోయే కాలంలోకేవలం 21రోజుల్లోనే ఆఫీస్‌ స్పేస్‌తో పాటు అనుమతులు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.