ఐటి ఉద్యోగులకు కష్టకాలం

IT SECTOR
IT SECTOR

ఐటి ఉద్యోగులకు కష్టకాలం

న్యూఢిల్లీ, అక్టోబరు 11: దేశీయ ఐటి ప్రొఫెషనల్స్‌కు గడ్డుకాలం మరింత పెరుగుతోంది. వచ్చే ఆరు నెలలు కూడా ఐటి ప్రొఫెషనల్స్‌కు ఉద్యోగవకాశాలు తగ్గిపోనున్నాయని తాజా రిపోర్టులు వెల్లడించాయి. ఆటోమేషన్‌, డిజిటైజేషన్‌ ప్రభావంతో సంప్రదాయ ఉద్యోగాలకు భారీ మొత్తంలో ఆటంకం కలుగనున్నట్టు తెలిపాయి.

ఎక్స్‌పెరిస్‌ ఐటిమ్యాన్‌ పవర్‌ గ్రూప్‌ ఇండియా మంగళవారం విడుదల చేసిన ఎక్స్‌పెరిస్‌ ఐటి ఎంప్లా§్‌ుమెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే ప్రకారం 2017 అక్టో బరు నుండి 2018 మార్చి మధ్యలో కూడా ఐటి నియామకాలు తగ్గిపోను న్నాయని తెలిసింది. అంతేకాక సీనియర్‌ స్థాయిలో లేఆఫ్స్‌ అధికంగా ఉండనున్నా యని సర్వే వెల్లడించింది. ఇటీవల అంత ర్జాతీయ టెక్‌దిగ్గజం కాగ్నిజెంట్‌ 400 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల వాలం టరీ సెపరేషన్‌ ప్యాకేజీని అంగీకరించిందని తెలి పింది. గతకొన్ని నెలల క్రితమే డైరెక్టర్ల్క, అసోసి యేట్‌ వీపీలకు, సీనియర్‌ వీపీలకు ఈ ప్రొగ్రామ్‌ను ఆఫర్‌చేసింది. క్యాప్‌జెమిని కూడా 35 మంది వీపీ, ఎస్‌వీపీలు, డైరెక్టర్లు, సీనియర్‌ డైరెక్టర్లను కంపెనీని వీడాలని ఆదేశించింది. ఇన్ఫోసిస్‌ కూడా జాబ్‌లెవల్‌ 6, ఆపైస్థాయి ఉద్యోగులు (గ్రూప్‌ ప్రాజెక్ట్‌ మేనే జర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, సీనియర్‌ ఆర్కిటెక్ట్స్‌, హైయల్‌ లెవల్స్‌) వెయ్యి మందిని కంపెనీని వీడా లని ఆదేశాలు జారీచేసినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.

10నుండి 20ఏళ్ల అనుభవ మున్న మధ్య, సీనియర్‌ లెవల్‌స్థాయి ప్రొఫెషనల్స్‌పై ఈ ప్రభావం అధికం గా ఉంటుందని, పెద్ద పెద్ద ఐటి కంపె నీలు వీరిని ఇంటికి సాగనంపడానికి లేఆఫ్స్‌ ప్రక్రియను చేపడుతున్నాయని సర్వే తెలిపింది. కేవలం 3శాతం కంపెనీలు మాత్రమే సీనియర్‌ స్థాయి ఉద్యోగులను నియమించుకోవడానికి మొగ్గుచూపుతున్నాయని వివరించింది. 0.5 ఏళ్ల అనుభవమున్న అభ్యర్థులకు ఎక్కువ డిమాండ్‌ ఏర్పడిందని చెప్పింది. సీనియర్‌ స్థాయిలో ఉద్యో గుల లేఆఫ్స్‌కు ప్రధాన కారణం బయటవ్యక్తులను నియమించుకోవడం కంటే అంతర్గతంగానే ఖాళీలను పూరించుకోవడ మైతే, మరో కారణం ఆటోమేషన్‌ అని తెలిసింది.