ఐటిరంగంలో 2.5 లక్షల కొత్త కొలువులు!

it sector
it sector

న్యూఢిల్లీ: భారత్‌ ఐటిరంగంలో 2019 సంవతసంలో సుమారు 2.5లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. సగటు వేతనం పెంపు కూడా 10నుంచి 13శాతంగా ఉంటుందని అంచనా. భారత్‌ ఐటి పరివ్రమ సగటున 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని, ఈ రంగం వృద్ధిచెందడమే ఇందుకు కీలకమని వెల్లడించింది. ఇందుకు డిజిటల్‌ ఇండియా కార్యాచరణ కీలకం అవుతుందని అంచనావేసింది. ఎక్కువశాతంపెట్టుబడులు డిజిటైజేషన్‌వైపునకు వస్తున్నాయి. అలాగే ఆటోమేషన్‌ కూడా అదేస్థాయిలోపెరుగుతున్నది. ఆర్ధికరంగసేవలు, డిజిటల్‌ బిజినెస్‌లలో మరింత వృద్ధి ఉంటుందని టీమ్‌లీజ్‌ సంస్థ అంచనావేస్తోంది. అంతేకాకుండా డిజిటల్‌ పరివర్తనం, ఐటి హైబ్రిడ్‌ దోరణులు ఎక్కువగా కొత్త కొలువులవైపు దృష్టిపెడుతున్నాయి.ఎక్కువగా గణితం, ఆర్కిటెక్చర్‌, ఇంజనీరింగ్‌ సంబంధిత రంగాల్లో పెంపు ఉంటుందని, కంప్యూటర్‌ గణితానికి ఎక్కువ డిమాండ్‌ ఉందని సంస్థ డజిఎం అల్కా ధింగ్రా వెల్లడించారు. 2020 నాటికి 20 లక్షల ఉద్యోగాలు రావచ్చని అంచనావేసారు. ప్రపంచ వ్యాప్తంగా వీటిపెంపు 13శాతగా ఉంటుందని అంచనా. ఇటీవలి ఆర్ధికఫలితాలనుచూస్తే అనేక ఐటిరంగ సంస్థలు తమ వర్క్‌ఫోర్స్‌ను 2020 నాటికి పెంచుకోవాలనే చూస్తున్నాయి. ఐటిరంగంలో ఈ డిమాండ్‌ రెండో అర్ధభాగంలోమరింత పెరిగింది. 2019నాటికి ఇదేతీరుతో 5జిసేవలు కూడా వస్తున్నందున ఉపాధి అవకాశాలు టెక్నాలజీరంగంలో మరింతపెరుగుతాయి. టీమ్‌లీజ్‌ అంచనాలప్రకారంచూస్తే ఎక్కువగా కృత్రిమమేధో విభాగానికి సైతం డిమాండ్‌ ఉంది. 2020 నాటిక ఇడేటా అనలిటిక్స్‌ రంగం భారీ వృద్ధితో ఉంటుంది.ఉపాధి అవకాశాలుసైతం 25శాతంపెరుగుతాయి. సాఫ్ట్‌వేర్‌ డెలవపర్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ అనలిస్టులు,మెషిన్‌ లెర్నింగ్‌, మొబిలిటీ క్లౌడ్‌ ఇంజనీర్‌, డెవ.ఆప్స్‌, నెట్‌వర్క్‌ అనలిస్ట్‌, సైబర్‌సెక్యూరిటీ నిపుణుల అవసరాలు ఎక్కువ ఉంటాయి. హెల్త్‌సైన్సెస్‌, ఫిన్‌టెక్‌ కంపెనీలు కూడా మరింత వృద్ధికి అవకాశం ఉంది, దీనివల్ల ఉపాధిఅవకాశాలు కూడా రెట్టింపు అవుతాయని అంచనా. మెఫిన్‌ లెర్నింగ్‌, డేటా అనలిటిక్స్‌కు ఎక్కువ అవకాశాలున్నట్లు ధింగ్రా వెల్లడించారు. సీనియర్‌స్థాయి కొలువులు తగ్గితే మధ్యస్థాయి కొలువులు పెరుగుతాయని అంచనా. ఇక భారత్‌లో వేతనాలు కూడా పదినుంచి 13శాతంపెరుగుతాయని అంచనా. టెక్నాలజీ రంగంలో ఎక్కువ చెల్లింపులు ఉంటాయి. బిగ్‌డేటా అనలిటిక్స్‌, మెషిన్‌లెర్నింగ్‌, ఎఐ డెవలపర్స్‌కు వేతనాలు ఎక్కువ ఉంటాయని అంచనా. ఇక ఆటోమేషన్‌, కృత్రిమ మేధ రోబోటిక్స్‌ వంటిరంగాలు పనిసంస్కృతి, వృత్తినైపుణ్యాలపై ఎక్కువ శ్రద్ధచూపించే అవకాశం ఉందని టీమ్‌లీజ్‌ వంటి సంస్థలు చెపుతున్నాయి.