ఐకెపి ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తాం

KCR
KCR

కరీంనగర్‌: పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిస్తున్నామని టిఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసిఆర్‌ అన్నారు. దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌ రాష్ట్రంగా ఉందన్నారు. విద్యుత్‌ బిల్లులు, విద్యుత్‌ కోతల సమస్యలు తలెత్తకుండా చేశామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి నెట్టబడుతుంది అని అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు కేసిఆర్‌ హాజరయ్యారు. సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..ఐకేపి ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని, హుజూరాబాద్‌కు ఎస్‌ఆర్‌ఎస్‌పి నీరు అందిస్తామన్నారు. కరీంనగర్‌ వాటర్‌ జంక్షన్‌గా మారబోతుందన్నారు. ఈటెలను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు కేసిఆర్‌ విజ్ఞప్తి చేశారు.