ఐఒసిఎల్‌లో ఉద్యోగాలు

IOCL
IOCL

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) – తూర్పు విభాగ మార్కెటింగ్‌ డివిజన్‌, జూనియర్‌ ఆపరేటర్‌ (ఏవియేషన్‌) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్‌ హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. డ్రైవింగ్‌లో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి. పార్ట్‌ టైం / కరస్పాండెన్స్‌ / డిస్టెన్స్‌ / ఓపెన్‌ యూనివర్సిటీ విధానాల్లో ఇంటర్‌ చదివినవారు, బిఈ / ఎంబీఏ / సీఏ / ఐసీడబ్ల్యుఏఐ / ఎల్‌ఎల్‌బీ / ఎంసీఏ వంటి ఉన్నత విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు.
వయసు: జూన్‌ 30 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ ప్రొఫిషియెన్సీ ఫిజికల్‌ టెస్ట్‌ ద్వారా
రాత పరీక్ష వివరాలు: పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఇస్తారు. జనరిక్‌ ఆప్టిట్యూడ్‌ & క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 40 ప్రశ్నలు, రీజనింగ్‌ ఎబిలిటీస్‌ నుంచి 40 ప్రశ్నలు, బేసిక్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. 90 నిమిషాల పరీక్ష సమయంలో వీటికి సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. రుణాత్మక మార్కులు లేవు. రాత పరీక్షలో అర్హత సాధించాలంటే జనరల్‌ ్క్ష ఓబీసీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు రిజర్వుడు వర్గాలకు 45 శాతం మార్కులు రావాలి. అర్హత పొందిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ఎస్‌పీపీటీ కి అనుమతిస్తారు.
రాత పరీక్ష జరుగు తేదీ: ఆగస్టు 5
రాత పరీక్ష ఫలితాల విడుదల: ఆగస్టు 25న
అభ్యర్థుల తుది ఎంపిక: సెప్టెంబరు 30న
దరఖాస్తు ఫీజు: రూ.150
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: జూన్‌ 16 నుంచి
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 7
వెబ్‌సైట్‌: www.iocl.com