ఐఐటి, జెఇఇలకు ప్రాధాన్యత

Students
Students

ఐఐటి, జెఇఇలకు ప్రాధాన్యత

ఈ ప్రవేశపరీక్ష మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రశ్నలు కూడా పునరావృతం కాకపోవడం. ఎంతో మంది ప్రొఫెసర్స్‌, సీనియర్‌ లెక్చరర్స్‌ రచించిన పుస్తకాలు ఎన్ని ఉన్నప్పటికీ వీటిలోని ప్రశ్నలకు భిన్నంగా జెఇఇ పరీక్షలో ప్రశ్నలను కూర్పు చేయడం. ఉదాహరణకు ఏదేని కాన్సెప్ట్‌కు సంబంధించి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పుస్తకాలను క్షుణ్ణంగా చదివినప్పటికీ, ఎన్నో ఇన్‌స్టిట్యూట్స్‌ శ్రమించి తయారుచేసిన ప్రశ్నల న్నింటినీ చేసినప్పటికీ వీటికి భిన్నంగా అదే విషయంపై సరికొత్త వ్యూహంతో సులభతరమైన ప్రశ్నలను కూర్పు చేయడం. ఏ ప్రశ్న కూడా సిలబస్‌ వెన కున్నది అనే భావం రాకుండా సిలబస్‌తో కూడు కున్నదని, రొటీన్‌ కాదన్నట్టుగా తయారు చేయడం మరో ప్రత్యేకత.

వీటన్నిటికితోడు కొన్ని సమస్యలను కనీసం రెండు లేదా అంతకన్నా ఎక్కువ అంశాల మిశ్రమంపై పట్టు ఉంటే తప్ప సాధన చేయ టానికి వీలుకానట్లుగా ఫ్రేమ్‌ చేయడం మరొక ప్రత్యేకత. ఈ విధానం వల్ల ఏవో కొన్ని టాపిక్స్‌ చదివి పరీక్ష రాసేవారికి చెల్లు పెట్టినట్లే. సంపూర్ణ విషయ పరిజ్ఞానం లేని విద్యార్థి సాధించుటలో వచ్చే సమాధానాలన్నీ ఆప్షన్స్‌ ఇచ్చి వాస్త వంగా అతనికున్న నాలెడ్జ్‌ని పరీక్షించటమే. బహుళైచ్ఛిక సమాధానాలు ఇచ్చి ప్రశ్నలను విద్యార్థి అన్నింటినీ గుర్తించ లేని విధంగా ఫ్రేమ్‌ చేయడం మరొక ప్రత్యేకత. అన్నింటికన్నా మించిన విషయం కాన్సెప్ట్స్‌పై పరిపూర్ణత కలిగి కూడా సమస్యను సాధించలేక పోవడం, వాటినే అసాధారణ సమస్యలు అంటారు. ప్రతి అసా ధారణ సమస్య సాధన ఒక వ్యూహాత్మకమే.

ఆ విధమైన సమస్యల సాధన చేసి సమాధా నాలు సాధించుటలో పడే తపన, అలసటలేని పోరాట తత్వం వల్ల వృద్ధి అయ్యే సృజనాత్మకత, సమస్యలకు పరిష్కారం వల్ల ఈ ప్రవేశ పరీక్ష రాసేటపుడు సమస్యలను అతి సాధారణ సమస్యల మాదిరిగా అవలీలగా సాధించ గలడు. విజయాన్ని సాధించి అత్యున్నత స్థానానికి ఎదుగుతాడు. కాలం అత్యంత అవశ్యకం: అహర్నిశలు శ్రమించే ఏ విద్యార్థికి అయినా నాన్‌- రొటీిన్‌ ప్రాబ్లమ్స్‌ సాధించడం అంత సులువయిన పనికాదు.

ఒక విద్యార్థి ఇంటర్‌ స్థాయిలో ఐఐటి, జెఇఇకి తయారు చేయడం అంటే ఆ విద్యార్థికి ప్రతి సబ్జెక్టులో చక్కటి ఫండమెంటల్స్‌ని ఇవ్వగలిగిన అధ్యాపకులు, ఇంటర్‌ సిలబస్‌ను కంప్లీట్‌ చేయడానికి, విద్యార్థులకు వాటి పూర్తి పట్టు రావడానికి కనీసం 5 నెలల కాలం పడుతుంది. తరువాత మిగిలిన సమయం లో అన్ని సబ్జెక్ట్సు పై లాజికల్‌గా ఆలోచన చేసేలా ప్రశ్నల సముదాయంతో అసైన ్‌మెంట్‌ ఇవ్వాలి. వాటిని పూర్తి గా చేయడా నికి సరిపడే సమయాన్ని విద్యార్థికి ఇవ్వాలి.

ప్రశ్నల పూర్తి సాధనకు ఏ అధ్యా కుడు కూడా ఇవ్వడం మంచిది కాదు. అతను ఏవిధంగా ఆ సమస్య సాధనను చేస్తున్నాడో, ఆ విధి విధానాలలో పూర్తిగా సాధించగల లోపాలను సరిచేస్తూ ఆ విద్యార్థితోనే సమస్య సాధించే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నానికి, విధానానికి కావలసింది అత్యంత ముఖ్యమైంది నాన్‌ రోటీన్‌ ప్రాబ్లమ్‌ అప్రోచ్‌, సమయం.
ఆ అప్రోచ్‌ను కింది తరగతులలో (8,9,10) నుంచే అభివృద్ధి చేయడం ఐఐటి ఫౌండే షన్‌ ముఖ్యఉద్దేశం. ఐఐటి ఫౌండేషన్‌ ప్రాధాన్యత: ఐఐటి, జెఇఇ ప్రశ్నాపత్రంలో ఇచ్చిన సమస్యల మాదిరిగా 8,9,10 తరగతి విద్యార్థులకు వారి టాపిక్స్‌పై సామర్థ్యం తగ్గకుండా వివిధ పద్ధతులను ఉపయోగించి నాన్‌- రొటీన్‌ ప్రాబ్లమ్స్‌, బేసిక్‌గా అవగాహన కలిగించేలా అసైన్‌మెంట్‌ తయారు చేయడం వాటిని వీలయి నంతవరకు విద్యార్థితోనే చేయించడం, డిస్కస్‌ చేయడం వంటి కార్యక్రమాలను మంచి వృత్తి నిబద్ధతగల లెక్చరర్ల సమక్షంలో జరపటమే ఐఐటి ఫౌండేషన్‌ కోర్సు లక్ష్యం.

ఒలింపియాడ్స్‌ రోల్‌ :
ఒలింపియాడ్స్‌ రాష్ట్రస్థాయిలో ఆర్‌ఎంఒ, జాతీయ స్థాయి లో ఐఎన్‌ఎంఒ, అంతర్జాతీయ స్థాయిలో ఐఎన్‌ ఎంఒ పరీక్షలు జరుగుతాయి. తమ పిల్లలను ఐఐటిలో చేర్పిం చాలనే తల్లి దండ్రులు సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఇవ్వగల పూర్తి పట్టుగల అధ్యాపకుల సూచనలను తీసుకుంటూ ఎక్కువ సమ యం క్లాస్‌ రూమ్‌కి పరిమితంగాకుండా, ఎక్కువ సమయాన్ని మంచి పుస్తకాలలో ఉండే సమస్యలను సొంతంగా సాధన చేసే ప్రక్రియను అభివృద్ధి చేస్తూ వాటిని సాధించడంలో వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి గురువుల సలహాలు తీసు కుంటూ సాగిపోవాలి