ఐఎస్ ఉగ్రవాది జీహాదీఖాన్ హతం
అమెరికా: ఐఎస్ఐఎస్ ఉగ్రవాది జిహాదీ జాన్ అమెరికా జరిపిన వైమానిక దాడిలో మరణించాడు. ఆ విషయాన్ని ఐఎస్ఐఎస్ అధికారిక పత్రిక ‘దబిక్ ధృవీకరించింది. జాన్ ప్రయాణిస్తున్న కారుపై అమెరికా జరిపిన దాడిలో జాన్ మరణించాడని పేర్కొంది. గత ఏడాది నవంబర్లో సిరియాలో ఈసంఘటన జరిగినట్టు ఆ పత్రిక వివరించింది.