ఐఎస్లో చేరేందుకు యత్నించిన విద్యార్థుల వ్యవహారంపై కేంద్రం ఆరా
ఐఎస్లో చేరేందుకు యత్నించిన విద్యార్థుల వ్యవహారంపై కేంద్రం ఆరా
న్యూఢిల్లీ: ఐఎస్లో చేరేందుకు యత్నించిన విద్యార్థుల వ్యవహారంపై కేంద్రం ఆరా తీసింది. కాశ్మీర్ వేర్పాటువాద నేత ఆధ్రాబిని విద్యార్థులు కలిసినట్టు అనుమానించింది. అయితే గత ఏడాది సెప్టెంబర్లో ఆంధ్రాని హైదరాబాద్ వచ్చారు. సిమి ఉగ్రవాది సలావుద్దీన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో విద్యార్థులను కలిసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన ఆంధ్రాబి.. తాను హైదరాబాద్ వెళ్లింది వాస్తవమేనని, అయితే తానువిద్యార్థులను కలవలేదని పేర్కొన్నారు. దీనిపై కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది.