ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌లను మార్పు చేసిన ఎస్‌బిఐ

SBI
SBI

ముంబాయి: ఐదు అనుబంధ బ్యాంకుల విలీనమైన నేపథ్యంలో దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగం బ్యాంకు ఎస్బీఐ. తన 1800 బ్యాంక్‌ శాఖల పేర్లు, ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌లను మార్పు చేసింది. ముంబాయి, న్యూఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, లఖ్‌నవూ వంటి ప్రధాన నగరాల్లో శాఖలో మార్పు చోటు చేసుకుంది. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకులు విలీనమైన నేపథ్యంలో ఈ మార్పు చేసినట్లు ఎస్బీఐ మేనేజింగ్‌ డైరక్టర్‌(రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌) ప్రవీణ్‌ గుప్త తెలిపారు. ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌లు మార్పు చేసిన విషయాన్ని ఖాతాదారులకు తెలియజేస్తున్నట్లు గుప్తా తెలిపారు. ఒకవేళ పాత ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ ఆధారంగా లావాదేవీలు జరిగినప్పటికీ కొత్త కోడ్‌కు అనుగుణంగా మార్పు చేస్తామని, ఈ విషయంలో ఖాతాదారులకు ఏలాంటి నష్టం వాటిల్లదిని చెప్పారు. మారిన బ్యాంకు శాఖల పేర్లు, వాటి ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ వివరాలను ఎస్బీఐ వెబ్‌సైట్‌లో ఉంచింది.