ఐఎఎస్‌లతో సహా మూమ్ముడి సెలవులో ఉన్నతాధికారులు

DELHI SEC

న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్‌ చేయటంతో ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులందరూ మూకుమ్మడి సెలవుపై వెళ్లిపోయారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులుగా ఉన్న ఢిల్లీ, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ ఐలాండ్‌స సివి సర్వీసెస్‌కు చెందిన అధికారులిద్దరిని ఢిల్లీ సర్కారు సస్పెండ్‌ చేసింది. దీంతో 200 మంది డానిక్‌్‌స అధికారులు మూకుమ్మడిగా సెలవు పెట్టారు. వీరికి మద్దతుగా 70 మంది ఐఎఎస్‌లు కూడ సగంరోజు సెలవు పెట్టారు. ఇదిలా ఉండగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల వేతనాలు పెంచుతూ ఢిల్లీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం తాలూకు ఫైలుపై సంతకాలు చేయటానికి నిరాకరించిన వీరిద్దరినీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఇదిలా ఉంటే ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేయటం అహేతుకమైన, అసంబద్ధమైన చర్యగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.