ఏసిబి విచారణకు హాజరైన ఎమ్మెల్యే ఆళ్ల

ALLA
ALLA

విజయవాడ: బినామీ ఆస్తుల కేసులో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసిబి ఎదుట విచారణకు హాజరయ్యారు. పలు కారణాలతో రెండు సార్లు విచారణకు గైర్హాజరైన ఆళ్ల సోమవారం ఉదయం ఏసిబి ఎదుట హాజరయ్యారు. ఏసిబికి పట్టుబడ్డ గుంటూరు డీఎస్పీ దుర్గాప్రసాద్‌కు చెందిన అక్రమాస్తుల్లో ఆళ్ల కుటుంబ సభ్యుల పేర్లను ఏసిబి గుర్తించింది. దీనిపై విచారణకు రావాల్సిందిగా ఏసిబి ఆళ్లకు నోటీసులు జారీ చేశారు. కాగా రెండు సార్లు తన తరఫున న్యాయవాదులను పంపిన ఎమ్మెల్యే మూడోసారి స్వయంగా ఏసిబి ముందు హాజరయ్యారు.