ఏవియేష‌న్ షో ప్రారంభం

Aviation show 2018
Aviation show 2018

హైద‌రాబాద్ః నగరంలోని బేగంపేట ఎయిర్‌పోర్టులో వింగ్స్ ఇండియా 2018 ఏరోస్పేస్ సదస్సు ప్రారంభమైంది. ఏరోస్పేస్ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమానికి ఇండియా-గ్లోబల్ ఏవియేషన్ హబ్‌ను ఇతివృత్తంగా ఎంపికచేశారు. అమెరికా, జపాన్, జర్మనీ, రష్యా, సింగపూర్, ఫ్రాన్స్, మలేషియా, హాంగ్‌కాంగ్, ఇటలీ, ఇరాన్ , బ్రిటన్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరైన ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫిక్కీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ నెల 11 వరకు ఏవియేషన్ షో కొనసాగనుంది.