ఏబిసిలో సెమీస్‌కు సైనా

Saina Nehwal
Saina Nehwal

వుహాన్‌ (చైనా):  భారత స్టార్‌ షట్లర్‌, కామన్వెల్త్‌ స్వర్ణ పతక విజేత  సైనా నెహ్వాల్‌  ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (ఏబీసీ)లో కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సైనా 21-15, 21-13తో లీ జాంగ్‌ మి (కొరియా)పై అలవోకగా గెలిచి సెమీస్‌కు చేరారు. ఫలితంగా కనీసం కాంస్య పతకాన్ని సైనా తన ఖాతాలో వేసుకున్నారు.  ఇక మరో క్వార్టర్‌ ఫైనల్స్‌లో పీవీ సింధు 19-21, 10-21తో సుంగ్‌ జీ హున్‌ (కొరియా) చేతిలో ఓడిపోవడంతో ఏబీసి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మరొకవైపు పురుషుల బ్యాడ్మింటన్‌ ప్రపంచ నంబర్‌ వన్‌ కిడాంబి శ్రీకాంత్‌  పోరాటం క్వార్టర్‌ ఫైనల్స్‌లోనే ముగిసింది. పురుషుల క్వార్టర్‌ ఫైనల్స్‌లో కిడాంబి 12-21,15-21తో లీ చోంగ్‌ వీ (మలేసియా) చేతిలో ఓటమి చెందారు.