ఏఫ్రిల్‌లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌

ECI
ECI

బెంగుళూరు: విద్యార్థుల పరీక్షల అనంతరం ఏఫ్రిల్‌ రెండో వారంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల అధికారులు తెలిపారు. 224మంది సభ్యులు పదవీకాలం మే 28తో ముగియనున్న నేపథ్యంలో కర్ణాటక శాసనసభ సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమీషన్‌ సన్నాహాలు చేస్తోంది. సీఎం అభ్యర్థిగా బిఎస్‌ యడ్యూరప్పను బిజెపి ప్రకటించగా, కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యను ఎన్నికల బరిలో దిగనుంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు ఇప్పటిచే ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. కర్ణాటకలో జెడిఎస్‌ బహుజన సమాజ్‌ పార్టీతో కలిసి మూడో ఫ్రంట్‌గా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది.