ఏప్రిల్ 26 న ప్రపంచ వ్యాపంగా విడుదల

MAHESH111
MAHESH

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకేక్కబోతున్న సినిమా భరత్ అనే నేను. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలో జరుగుతోంది. కైరాఅద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా మొదట ఏప్రిల్ 27 న రాబోతోందని ప్రకటించారు. తరువాత ఏప్రిల్ 26 న ప్రపంచ వ్యాపంగా విడుదల కానుందని అధికారికంగా అనౌన్స్ చేసారు.

కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారి అంచనాలు ఉన్నాయి. తాజా సమాచారం మేరకు ఈ మూవీ ఒక షెడ్యూల్ లండన్ లో ప్లాన్ చేసారని తెలుస్తోంది. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరించబోతున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఆ షెడ్యూల్ ప్రారంభం కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.