ఏప్రిల్ 2న కోదండ‌రాం పార్టీ ప్ర‌క‌ట‌న‌

Kodanda ram
Kodanda ram

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్ సార‌థ్యంలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు స‌న్నాహాలు సిద్ధం అవుతున్నాయి. తెలంగాణ జనసమితి పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపినట్టు సమాచారం. అయితే, ఆ పార్టీ పేరు, జెండా, ఎజెండా ఏమిటనే విషయాన్ని ఏప్రిల్‌ 2న ఆయన ప్రకటించనున్నారు. అలాగే ఏప్రిల్‌ 4న పార్టీ పతాకం ఆవిష్కరించి, పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. ఆయన పార్టీ పేరు తెలంగాణ జనసమితిగా గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన పార్టీ పేరు, జెండా, ఎజెండా, విధివిధానాలు తదితర అంశాలను ఆయన అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే ఏప్రిల్‌ 29న భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఏ యే ప్రాంతాల్లో బహిరంగ సభ ఏర్పాటుచేయాలనే అంశంపై ఇప్పటికే ఆయన పోలీసులను సంప్రదించారు. పరేడ్‌ గ్రౌండ్స్‌, ఎల్బీ స్టేడియం, ఎన్టీఆర్‌ స్టేడియంలలో ఏదైనా ఒకచోట తాము బహిరంగ సభ ఏర్పాటుచేసుకొనేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరారు. అయితే, పోలీసులు ఎక్కడ అనుమతి ఇస్తే అక్కడ వారు తమ బహిరంగ సభ ఏర్పాటుచేసి తమ పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నారు. కోదండరాం పెట్టబోయే పార్టీ పతాకంలో తెలుపు, నీలం, పచ్చరంగులతో పాటు అమరవీరులు, కార్మికులు, రైతుల చిహ్నాలను ఉంచినట్టు తెలుస్తోంది.