ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌లో ఐపిఎల్‌ 10వ ఎడిషన్‌ ప్రారంభం

s5
IPL 2017

ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌లో ఐపిఎల్‌ 10వ ఎడిషన్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీయర్‌ లీగ్‌ తాజా సీజన్‌ హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 5న ప్రారంభం కానుంది.ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరా బాద్‌, రన్నర్స్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూ రులో తలపడనుంది.క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదవ ఎడిషన్‌ ట్రోఫీ టూర్‌ మొదలైన సంగతి తెలిసిందే.

చండీగడ్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న ట్రోఫీని ఎర్రకోట వద్ద ప్రదర్శనకు ఉంచారు.ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఐపిఎల్‌ 10 చాంపియన్స్‌ అందుకోబోయే ట్రోఫీ సందడి చేసింది.ఈ సందర్భంగా బాలీవుడ్‌ నటి సుర్వీన్‌ చావ్లా ట్రోఫీ వద్ద సెల్పీలు దిగుతూ సందడి చేసింది.ఎర్రకోట వద్ద ట్రోఫీతో దిగిన సెల్ఫీలను చోప్రా ట్విటర్‌లో పోస్టు చేసింది.అనంతరం ఐపిఎల్‌ ట్రోఫీని ఢిల్లీలోని సిటీ వాక్‌ మాల్‌లో ప్రదర్శనకు ఉంచారు.అభిమానుల కోసం నిర్వాహ కులు దేశవ్యాప్తంగా మార్చి 10 నుంచి 31 వరకు దేశంలోని 16 ప్రధాన నగరాల్లో ఐపిఎల్‌ ట్రోఫీని ప్రదర్శనకు ఉంచుతున్నారు.

ఇందులో భాగంగానే శనివారం ఐపిఎల్‌లో ట్రోఫీ ఢిల్లీకి చేరుకుంది.చివరగా మార్చి 31న పుణేలో ఐపిఎల్‌ ట్రోఫీ పర్యటన ముగియనుంది.ఐపిఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వివో వ్యవహరిస్తుంది. మే 21న ఐపిఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడి యంలో ఏప్రిల్‌ 5న జరుగనుంది.ఇదే స్టేడి యంలో మే 21న ఐపిఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగ నుంది.దేశ వ్యాప్తంగా 10 వేదికల్లో 47 రోజుల పాటు మొత్తం 60 మ్యాచ్‌లను నిర్వహించను న్నట్లు బిసిసిఐతెలిపింది. ప్రతి జట్టు 14 మ్యాచ్‌ లను ఇతర జట్లతో ఆడాల్సి ఉంటుంది.అందులో 7 మ్యాచ్‌లు సొంత మైదానం ఆతిథ్య మిస్తుంది.క్వాలిఫయర్స్‌,ఎలిమినేటర్స్‌ వేదికలను ఇంకా నిర్ణయించలేదు.మరోవైపు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తమ రెండవ హోమ్‌ గ్రౌండ్‌గా ఇండోర్‌ను ఎంపిక చేసుకుంది