ఏప్రిల్‌ 27న సమ్మర్‌ స్పెషల్‌గా

MaheshBabu
MaheshBabu

ఏప్రిల్‌ 27న సమ్మర్‌ స్పెషల్‌గా మహేష్‌బాబు చిత్రం

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత దానయ్య డివివి ప్రొడక్షన్స్‌ నెంబర్‌ 3గా నిర్మిస్తున్న భారీ చిత్రం షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డివివి మాట్లాడారు.. నవంబర్‌ 7 వరకు హైదరాబాద్‌ షెడ్యూల్‌ జరుగుతుందన్నారు.. నవంబర్‌ 22న ఉంచి ఔట్‌ డోర్‌ షెడ్యూల్‌ నాన్‌స్టాప్‌గా జరుగుతుందన్నారు.. మహేష్‌ , కొరటాల కాంబినేషన్‌లో మా బేనర్‌లో సినిమా చేయటం చాలా హ్యాపీగా ఉందన్నారు.. మహేష్‌ కెరీర్‌లో ఇది మరో పవర్‌ఫుల్‌ మూవీ అలాగే మా బేనర్‌గా బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా అవుతుందన్నారు.. ఈచిత్రాన్ని ఏప్రిల్‌ 27న సమ్మర్‌ స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి ప్లాన్‌ చేస్తున్నామని అన్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌తోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్‌ అందిస్తున్నారు.